By: ABP Desam | Updated at : 08 Apr 2022 01:07 PM (IST)
Photo credit: Twitter
మనం రోజు వందల చిత్రాలను చూస్తుంటాం. అందులో కొన్ని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. చూసిన వెంటనే ఓ పిక్చర్ మన మైండ్‌లో మెదులుతుంది. కాసేపు అదే పనిగా చూస్తే మాత్రం రకరకాల పిక్చర్స్ కనిపిస్తాయి. దీన్నే ఇల్యూజన్ అంటారు.
మనిషి మైండ్‌ను చదవాలంటే ఇలాంటి ఇల్యూజన్ పిక్చర్స్ చాలా ఉపయోగపడతాయి. దీనికి ఆధ్యుడు రోషక్. ఆయన రూపొందించిన ఇంక్‌బ్లాట్ టెస్టు ఇప్పటికీ వాడుతున్నారు.
టెక్నాలజీ పెరిగిన కొద్ది ఇలాంటి ఇల్యూజన్ పిక్చర్స్ రోజూ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. కొన్ని ఫజిల్స్ సాల్వ్ చేయాలంటూ కొన్న ఛాలెంజెస్ వస్తుంటాయి. అయితే వీటికి భిన్నంగా ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రం మీ పని తీరును విశ్లేషిస్తుంది. మీరు ఏ కేటగిరికి చెందిన వాళ్లు చెబుతుంది.
ఈ చిత్రంలో మీకు ఏం కనిపించింది. మొదట మీ మైండ్‌లో ప్లాష్ అయిన ఆబ్జెక్ట్ ఏంటో దాన్ని బట్టి మీ మనసు చదివేయవచ్చు.
అంతే కాకుండా మీరు మల్టీటాస్కింగ్ చేయగలరో లేదో తెలిసిపోతుంది. మీ ఆలోనలు ఎంత వేగంగా మారుతున్నాయో కనిపెట్టేయొచ్చు.
ఈ చిత్రంలో చీకటని చీల్చుకుంటూ ఓ వ్యక్తి పరుగెత్తుతున్నట్టు కనిపిస్తుంది. ఓ రకంగా చూస్తే మీ వైపు వస్తున్నాట్టు కానీ మీ నుంచి వెళ్లిపోతున్నట్టు కనిపిస్తుంది.
బొమ్మ మీ వైపు వస్తున్నట్టు కనిపిస్తే మీరు విషయాన్ని బాగా విశ్లేషించగలరని... ఏదైనా పని చేస్తే మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టి చేస్తారని అర్థం. ఏదైనా విషయంపై లోతుగా అధ్యయనం చేస్తారు.
మీరు మల్టీటాస్కింగ్‌కు దూరంగా ఉంటే బెటర్. ఒకే విషయంపై ఫోకస్ పని చేయాలని సూచిస్తున్నారు సైకాలజిస్టులు.
చీకటిలో ఉన్న ఆ వ్యక్తి మీ నుంచి దూరంగా పారిపోతున్నట్లు కనిపిస్తే, మీ విశ్లేషణాత్మక, తార్కిక నైపుణ్యాలు పీక్స్‌లో ఉన్నాయని అర్థం.
క్రియేటివ్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది. తీరిక సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవాడనికి ఆలోచిస్తారు. మీరు మంచి మల్టీ టాస్కర్ అని ఫ్యాక్ట్ ప్యాక్టరీ చెబుతోంది. మీకున్న జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువని చెబుతోంది.
మానవ బ్రెయిన్ పై చాలా ఏళ్ల నుంచి వివిధ రకాల అధ్యయనాలు జరిగాయి. అలాంటి సర్వే చేసిన న్యూరోసైంటిస్ట్ దఫ్నా జియోల్.. ఫిమేల్ బ్రెయిన్, మేల్ బ్రెయిన్ మధ్య తేడాను గుర్తించారు. మగవారిలో పోటీ తత్వం ఎక్కువ ఉంటుందని... ఆడవారిలో కమ్యునికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పారు.
Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు
Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం
Japan Dog Man: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్‌లో డాగ్ మ్యాన్!
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !
IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?
Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్