Couple Remarry: తిక్క జంట - ప్రతి మూడేళ్లకు విడాకులు, మళ్లీ ఒక్కటై పెళ్లి, ఇంటి పేరే తంట!

వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ వెంటనే పెళ్లిచేసుకుని మళ్లీ విడాకులకు దరకాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు.

FOLLOW US: 

క్కసారి పెళ్లి చేసుకోడానికే చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది ఈ జంట ప్రతి మూడేళ్లకు ఒకసారి విడాకులు తీసుకుని.. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇదేం సరదా అని అనుకుంటున్నారా? కానే కాదు.. ఇది ఇగో ప్రాబ్లం. అదేంటీ, అంత ఇగో ఉంటే పూర్తిగా విడిపోవాలి. కానీ, మళ్లీ మళ్లీ అదే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏమిటనేగా మీ సందేహం. ఇందులోనే చిన్న ట్విస్ట్ ఉంది. ఆ జంటకు ఒకరంటే ఒకరు ఇష్టమే. కానీ, ఒక్క విషయంలో మాత్రం రాజీ పడలేకపోతున్నారు. అందుకే, మూడేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకుని.. ఎవరి ఇగోను వారు సంతృప్తి పరుచుకుంటున్నారు. 

జపాన్‌కు చెందిన ఓ జంట 2016లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఈ ఏడాది జులైలో విడాకులు తీసుకోడానికి సిద్ధమవుతున్నారు. విడాకులు రాగానే మళ్లీ ఇదే ఏడాదిలో పెళ్లి చేసుకోడానికి మూహూర్తం పెట్టుకున్నారు. అసలు విడాకులు తీసుకోవడం ఎందుకు? మళ్లీ పెళ్లి చేసుకోవడం ఎందుకు? అనేగా మీ సందేహం. ఇందుకు కారణం వారి ‘ఇంటి పేరు’.

ఔనండి, మీరు విన్నది నిజమే. వారి ఇంటి పేరే వారిని విడాకులు తీసుకుని పెళ్లి చేసుకొనేలా చేస్తోంది. జపన్ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆ జంటలకు వేర్వేరు ఇంటి పేర్లు ఉండకూడదు. కేవలం ఒకే ఇంటి పేరు ఇద్దరికీ ఉండాలి. అది అమ్మాయి ఇంటి పేరైనా కావచ్చు, లేదా అబ్బాయిదైనా పర్వాలేదు. ఎవరి ఇంటి పేరును తమ పేరు చివరన ఉంచుకోవాలనే నిర్ణయం పూర్తిగా ఆ జంటదే. 

టోక్యో శివార్లలోని హచియోజీ నగరానికి చెందిన ఒక జంటకు ఈ రూల్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే, పెళ్లి తర్వాత కూడా తమ పేరు చివర తమ ఇంటి పేరే ఉండాలని కోరుకున్నారు. ఎన్నాళ్ల నుంచో పెళ్లి చేసుకుంటున్న ఈ జంట పెళ్లి చేసుకోడానికి సిద్ధమైనప్పుడల్లా ఈ సమస్య ఎదురయ్యేది. దానివల్ల వారి పెళ్లి చాలాసార్లు వాయిదా పడింది. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత.. ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. పెళ్లి తర్వాత మూడేళ్లు భార్య ఇంటి పేరును భర్త తన పేరు చివరన పెట్టుకోవాలి. ఆ తర్వాత మూడేళ్లు భర్త ఇంటి పేరును భార్య పెట్టుకోవాలి. ఇలా చేయాలంటే విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకుని పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే చట్టం కూడా దానికి అంగీకరిస్తుంది. 

దీనిపై భార్య (పేరు వెల్లడించలేదు) ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘పెళ్లికి ముందు నా ప్రియుడు.. మహిళలే భర్త ఇంటి పేరును తీసుకోవాలని వాదించాడు. కానీ, నేను అతడి మాటలతో ఏకీభవించలేదు. దీంతో కొన్నాళ్లు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి సమస్య ఎదుర్కొన్న ఓ జంట గురించి తెలుసుకున్నాం. విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవడం ద్వారా పేర్లను మార్చుకోవచ్చని చెప్పారు. దీంతో మేం కూడా అదే ఒప్పందాన్ని చేసుకున్నాం’’ అని తెలిపింది. 
 
ఆఫీసు, ఇతర సర్టిఫికెట్లలో మాత్రం ఆమె భర్త ఇంటి పేరును మార్చలేదు. పేరు మార్పు వల్ల అతడు గందరగోళ పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనే కారణంతో ఆ ఒక్క విషయంలో ఆమె.. అతడికి ఉపశమనం కలిగించింది. ఒక్కోసారి అధికారులు అడిగినప్పుడు కూడా ఠక్కున అతడు తన ఇంటి పేరుతో తన పేరు చెప్పుకొనేవాడు. దాని వల్ల ఇద్దరికీ గొడవలు కూడా జరిగేవి. ఈ సందర్భంగా భర్త మాట్లాడుతూ.. ‘‘నేను నా భార్య ఇంటి పేరును కలిగి ఉన్నానని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి’’ అని చమత్కరించాడు. 

Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..

అయితే, వీరు ఇంకా ఎన్నాళ్లు ఇలా చేస్తారు? వారికి పిల్లలు పుడితే పరిస్థితి ఏమిటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వారి ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్.. విదేశాలకు వెళ్లి తమ సొంత పేర్లతో పెళ్లి చేసుకుని రిజిస్టర్ చేసుకోవడం. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి.. జపాన్ కోర్టును ఆశ్రయించడం. తాము వేరే దేశంలో పెళ్లి చేసుకున్నామని, తమ ఇంటి పేర్లు వేర్వేరుగా ఉన్నా.. తమని వైవాహిక జంటగా గుర్తించాలని కోర్టును కోరాలి. అప్పుడే వారి పెళ్లి జపాన్‌లో చెల్లుతుంది. లేకపోతే.. వీరు ప్రతి మూడేళ్లకు అలా విడాకులు తీసుకుంటూ.. పెళ్లిల్లు చేసుకుంటూ ఉండాల్సిందే. 

Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?

Published at : 06 Apr 2022 11:20 AM (IST) Tags: Japan Wedding Rule Wedding Rule in Japan Family Name in Japan Japan Wedding Rule Family Name Couple Divorce and Remarry Couple Remarry in Japan

సంబంధిత కథనాలు

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం

Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం

Japan Dog Man: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్‌లో డాగ్ మ్యాన్!

Japan Dog Man: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్‌లో డాగ్ మ్యాన్!

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు

Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు