High Salaries to Cleaning Staff: పని మనుషులకు లక్షల్లో జీతమట, ఎక్కడో తెలుసా?
High Salaries to Cleaning Staff: పారిశుద్ధ్య కార్మికులకు ఆ దేశంలో లక్షల్లో జీతం ఇస్తారట. వారి కొరత వాళ్లే లక్షలు చెల్లించేందుకైనా ముందుకొస్తున్నాయి ఆ దేశాలు. అయితే అదెక్కడో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.
High Salaries to Cleaning Staff: మన దేశంలో పారిశుద్ధ్య కార్మికులు అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. చదువు లేక, ఏ పనీ చేయలేని వారే అలాంటి పనులు చేస్తారనే భావన కూడా ఉంటుంది. అందుకే సమాజంలో వారికి ఎక్కువగా గౌరవ, మర్యాదలు దక్కువు. స్వీపర్, సఫాయివాలా, పని మనిషఇ ఇని పులుస్తూ.. వారిని చాలా హేళనగా చూస్తుంటాం. అదే డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, టీచర్లను గొప్పగా భావిస్తుంటాం. కానీ ఇలాంటి వారి కంటే పారిశుద్ధ్య కార్మికులకే ఆ దేశంల ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటా. అందుకు కారణం.. వారికి అక్కడ దీతం లక్షల్లో రావడమే. అన్ని ఉద్యోగాలు చేసే వాళ్ల కంటే పారిశుద్ధ్య కార్మికుల జీతమే అక్కడ చాలా ఎక్కువట.
72 లక్షల నుంచి 80 లక్షల వరకు ఆదాయం..
ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికుల కొరత చాలా ఎక్కువగా ఉందట. ఆ పని చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయట. ఈ క్రమంలోనే పలు కంపెనీలు అధిక జీతం ఇచ్చి అయినా సరే పని మనుషులను పెట్టుకుంటున్నారు. లక్షల్లో చెల్లిస్తూ.. ఇళ్లు, ఆఫీసు ఊడ్చడం, తుడవడం వంటి పనులు చేయించుకుంటున్నారు. అలాగే మరికొన్ని కంపెనీలు గంట ప్రాతిపదికన కూడా భారీ జీతాలను అందిస్తున్నాయట. అందుకే ఆస్ట్రేలియాలో కార్మికులు ప్రతి నెల సగటున 8 లక్షల రూపాయల జీతం పొందుతున్నారు. సంవత్సరానికి 72 లక్షల నుంచి 80 లక్షల వరకు డబ్బు సంపాదిస్తున్నారు.
గంటకు 3 వేల 500 రూపాయలట..
సిడ్నీకి చెందిన క్లీనింగ్ కెంపనీ అబ్సొల్యూట్ డొమెస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జో వెస్ మాట్లాడుతూ... ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను భారీగా పెంచాల్సి వస్తోందని చెప్పారు. ఆ పని చేసే వారు దొరక్క గంటరు 45 డాలర్లు ఇస్తూ మనుషులను పెట్టుకోవాల్సి వస్తుందని వాపోయారు. అంటే మన కరెన్సీలో 3600 రూపాయలు. 2021 నుంచి ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికుల కోటా కొనసాగుతోంది. ఏడాది క్రితం గంటకు 2700 ఇచ్చేవారట. కానీ ఇప్పుడు 3500 నుంచి 3600 వరకు ఇవ్వాల్సి వస్తోందట.
పారిశుద్ధ్య పనులు చేసే కార్మికుల జీతం అంతటా 3 వేల కంటే ఎక్కువే. కొన్ని కంపెనీలు అయితే 4700 రూపాయలు చెల్లించేందుకు కూడా వెనకడుగు వేయట్లేదట. అలా అక్కడ పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు ఏడా 98 లక్షల వరకు సంపాదిస్తున్నారట. కొందరికి అయితే కోటి రూపాయలు కూడా దాటుతోందట. ఆఫీసుల్లో కిటీకులు, టేబుళ్లు శుభ్రం చేస్తూ.. 82 లక్షల వరకు సంపాదించే వాళ్లు చాలా మందే ఉన్నారట. ఇదంతా చూస్తుంటే మీకూ ఆస్ట్రేలియా వెళ్లాలనిపిస్తోందా.