(Source: ECI/ABP News/ABP Majha)
Jizzy Jewelry: వీర్యం, తల్లిపాలతో నగల తయారీ, ఈ మహిళ చాలా డిఫరెంట్ గురూ!
'పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి'పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు. ఓ కెనడియన్ కళాకారిణిని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఆమె తయారు చేసే ఆభరణాల్లో ఉపయోగించే పదార్థాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
అమండా.. కెనడాలో ఈమె పేరు తెలియని వారు ఉండరు. అందుకు కారణం తను తయారు చేసే నగలు. సాధారణంగా ఎవరైనా ఆభరణాలను బంగారం, వెండి, ఫ్లాటినం.. లేదంటే రకరకాల రంగురాళ్లు, గవ్వలతో తయారు చేస్తారు. కానీ ఈమె తల్లిపాలు, వీర్యం, బూడిదతో తయారు చేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ముమ్మాటికీ వాస్తవం. ఈమె తయారు చేసే ఆభరణాలకు ‘Jizzy Jewelry’ (జిజ్జీ జ్యువెలరీ) అనే పేరు కూడా పెట్టుకుంది.
భర్త గిఫ్ట్ ద్వారా కొత్త ఆలోచన
ఓసారి తన భర్త ఆమెకు క్వింకీ ట్విస్ట్ తో కూడిన ముత్యాల నగను అందించారు. అప్పుడే తనకు ఓ ఆలోచన వచ్చింది. మనిషి శరీర ద్రవాలను ఉపయోగించి ఆభరణాలు తయారు చేయాలి అనుకుంది. అందులో భాగంగానే తల్లిపాలు, మనిషి వీర్యాన్ని ఉపయోగించి నగలను తయారు చేస్తోంది. ఇప్పటికే వీటితో ఆమె పలు రకాల నగలను తయారు చేసింది. వీర్యాన్ని ఎండబెట్టి, పొడి చేసి, ఆపై ఆభరణాలుగా తయారు చేస్తోంది. ఈమె తయారు చేసే వస్తువులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందట. అంతేకాదు.. ఈమె ఆభరణాలను చూసి జనాలు చాలా కొత్తవిగా భావిస్తారట.
— Clown World ™ 🤡 (@ClownWorld_) August 31, 2022
అమెరికాలో కొత్తేమీ కాదు
వాస్తవానికి తల్లిపాలతో ఆభరణాలను తయారు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే అమెరికాలో పలువురు తల్లిపాలతో నగలను తయారు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ముందుగా బ్రెస్ట్ మిల్క్ ను డీహైడ్రేట్ చేసి పొడిగా మార్చుతారు. ఆ పౌడర్‌ను రెసిన్ అనే కెమికల్‌తో కలిపి ఒక రాయిగా తయారు చేస్తారు. వాటిని వేరబుల్ లాకెట్లుగా మారుస్తూ, ఆకట్టుకునే ఫినిషింగ్‌తో జ్యువెలరీగా మారుస్తారు. ఇలాంటి ఒక్కో లాకెట్ ధర 60 డాలర్ల నుంచి 150 డాలర్ల వరకు ఉంటుంది. భారత కరెన్సీలో ఈ ధర రూ.4,500 నుంచి రూ.11,000 అన్నమాట. అంతేకాదు.. తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలను చాలా మంది సెంటిమెంట్ గా ధరిస్తున్నారట.
కొత్త కంపెనీల ఏర్పాటు
ప్రస్తుతం అమెరికాలో తల్లిపాల ద్వారా ప్రొడక్ట్స్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా కంపెనీలు వెలుస్తున్నాయి. ఇప్పటికే వెలిసిన కొన్ని సంస్థలు అద్భుతంగా తల్లిపాలతో నగలు తయారు చేసే నిపుణులను నియమించుకుంటున్నారట. మమ్మాస్ లిక్విడ్ లవ్ సంస్థ సుమారు 4 వేల బ్రెస్ట్ మిల్క్ జ్యువెల్స్ అమ్మినట్లు వెల్లడించింది.
ఈ బ్రెస్ట్ మిల్క్ జ్యువెల్స్ చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా నీటిలో ఉంచకూడదు. కెమికల్స్ అంటకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ నగలు నీటిలో చాలా సేపు ఉన్నా.. వివిధ రకాల రసాయనాలు తగిలినా వెంటనే చెడిపోతాయని నగల తయారీ కంపెనీలు చెప్తున్నాయి. ఈ నగలు కావాలి అనుకునే వారు ఎంత మోతాదులో తల్లిపాలు తీసుకురావాలో కంపెనీలు సూచిస్తాయి. అంతేకాదు.. తల్లి రొమ్ము నుంచి తీసిన పాలను ఎలా తమ దగ్గరికి తీసుకురావాలో కూడా వివరిస్తున్నాయి.
Also Read: స్పైసీ ఫుడ్ మస్త్ హెల్దీ, ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Also Read: నిమ్మరసం తాగితే మెరిసే చర్మం మీ సొంతం, మరెన్నో ప్రయోజనాలు