Aryan Khan: వోడ్కా బిజినెస్‌లోకి షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, ఆడేసుకుంటున్న నెటిజన్స్!
ఆర్యన్ ఖాన్ ఓ లిక్కర్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాడు. భారతదేశంలో D'YAVOL పేరుతో కొత్త వోడ్కా బ్రాండ్ ను స్టార్ట్ చేసిన అతను మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు.
డ్రగ్స్ కేసులో ఒక్కసారే వార్తల్లోకి ఎక్కిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మరోసారి అందరి దృష్టిలో పడ్డాడు. అయితే, ఈ సారి డ్రగ్స్ కేసుతో కాదు. వోడ్కా బిజినెస్‌తో. ఔనండి, ఆర్యన్ కొత్తగా వోడ్కా బిజినెస్ ప్రారంభిస్తున్నాడట. దీంతో నెటిజనులు అతడిని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
ఆర్యన్ D'YAVOL పేరుతో కొత్త వోడ్కా బ్రాండ్‌ను మొదలుపెట్టాడు. ఇప్పటికే.. డ్రగ్స్ వివాదాలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఆర్యన్ ఈ బిజినెస్‌తో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. శ్లాబ్ వెంచర్స్ అనే పేరుతో ఓ సొంత కంపెనీని ప్రారంభించిన ఆర్యన్.. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రివరేజీ కంపెనీ అయినా ఏబీ ఇన్ బెవ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. శ్లాబ్ వెంచర్స్ ఉత్పత్తులను ఏబీ ఇన్ బెవ్ మార్కెటింగ్ చేయనుంది.
వోడ్కా బ్రాండ్‌కు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ బ్రాండ్‌ను ఎక్కువగా యువతులు, మహిళలు మాత్రమే తాగుతున్నారని, గతంలో ఓ నివేదికలో వెల్లడైంది. ఇంతటి ఆదరణ ఉన్న ఈ బ్రాండింగ్ బిజినెస్‌లోకి ఆర్యన్ చేరడం సంచలనంగా మారింది. షారుఖ్ ఖాన్, ఆర్యన్‌లు తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. ఆర్యన్‌కు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదని, అందుకే అతడు బిజినెస్‌లోకి దిగాడంటూ ఓ ప్రముఖ వార్త పత్రిక ప్రచురించింది. ఇక షారుఖ్ సినిమాలతో పాటు చాలా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్స్ పేరుతో స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు.
ఆర్యన్ వోడ్కా బిజినెస్‌లోకి ఎంట్రిపై విమర్శలు:
డ్రగ్స్ కేసు విచారణ అనంతరం ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లభించకపోవడంతో చివరకు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ సమయంలో వోడ్కా బిజెనెస్‌లోకి దిగడంపై ఇప్పుడు సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలోని రిచ్ కస్టమర్లు లక్ష్యంగా ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్, దుస్తులు, యాక్సెసరీస్ సహా ఇతర ప్రీమియం కస్టమర్ల కేటగిరీలతో మరింతగా విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపిన ఆర్యన్‌పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. గతంలో పార్టీలో తన ఫ్రెండ్స్‌తో నార్కోటిక్ అధికారులకు దొరికిన ఆర్యన్.. వాళ్లకు డ్రగ్స్ సప్లై చేసి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ యాక్టింగ్‌పై నీకు ఇంట్రెస్ట్ లేకపోతే... కనీసం ప్రొడ్యూసర్‌గా లేదా డైరెక్టర్‌గా అయినా కేరీర్‌ను ప్రారంభించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
Also Read : టికెట్ రేట్స్ మీద బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు - 'తారకరామ' థియేటర్ పునఃప్రారంభంలో నందమూరి నాయకుడు ఏమన్నారంటే?