అన్వేషించండి

Revanth US Tour : హైదరాబాద్‌లో జోయిటిస్ ఇండియా సెంటర్ విస్తరణ - రేవంత్ యూఎస్ పర్యటనలో మరో కీలక ఒప్పందం

Telangana : హైదరాబాద్ లో జొయిటిస్ ఇండియా సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించారు. ఈ విస్తరణ ప్రక్రియ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో జోయిటీస్ బృందం సమావేశం అయింది.

Zoetis Inc in Hyderabad :    ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్ (Zoetis Inc.) కంపెనీ హైదరాబాద్​లో తమ  కెపాబులిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్‌లోని జొయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​ బాబుతో  పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. 

జోయిటీస్ ప్రతినిధులతో సీఎం  రేవంత్ రెడ్డి బృందం సమావేశం                          

హైదరాబాద్‌లో తమ జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించే నిర్ణయాన్ని  సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని సీఎం తెలిపారు.   హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జోయిటిస్ రంగ ప్రవేశం హైదరాబాద్ కు మరింత గుర్తింపు తెస్తుందని రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.  

హైదరాబాద్ అనువైన ప్రాంతమని జోయిటీస్ సంతృప్తి                              

ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని  జోయిటిస్‌ కంపెనీ  చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ సీఎం బృందానికి తెలిపారు.  తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరి కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందని..  తెలంగాణలో  అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్  అన్నారు. ప్రపంచంతో పోటీ పడే సేవలందించటంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామని హామీ ఇచ్చారు.  జొయిటిస్ కంపెనీ విస్తరణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు, తమ ప్రభుత్వ విధానాలపై  ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలతో పాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు.  

70 ఏల్ల చరిత్ర ఉన్న జోయిటీస్ ఇంక్        

జొయిటిస్ కంపెనీ దాదాపు 70 సంవత్సరాలుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నిరోధించే మార్గాలు, చికిత్స సంబంధిత అంశాలపై పని చేస్తోంది. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తోంది. ఔషధాలతో పాటు వ్యాక్సిన్‌లు, రోగ నిర్ధారణలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలపై దాదాపు వంద దేశాలకు సేవలు అందిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Land Slide: వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Lavanya theft case against Raj Tarun : బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ రేటు ఎంత?బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నంవరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబువినాయక నిమజ్జనం వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land Slide: వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Lavanya theft case against Raj Tarun : బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
GST On Cancer Drugs: కేన్సర్‌ మందుల నుంచి చిరుతిళ్ల వరకు రేట్లు భారీగా తగ్గుతున్నాయ్‌! ఎందుకంటే?
కేన్సర్‌ మందుల నుంచి చిరుతిళ్ల వరకు రేట్లు భారీగా తగ్గుతున్నాయ్‌! ఎందుకంటే?
CM Chandrbabu: సాధారణ స్థితికి విజయవాడ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సాధారణ స్థితికి విజయవాడ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Prakasam News: ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన
ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన
Janhvi Kapoor : ఈసారి జాన్వీ వయ్యారం ఓణి కాదు చీర కట్టింది..  దేవర ప్రమోషన్స్​లో దేవకన్య వైబ్స్ ఇస్తోన్న బ్యూటీ
ఈసారి జాన్వీ వయ్యారం ఓణి కాదు చీర కట్టింది.. దేవర ప్రమోషన్స్​లో దేవకన్య వైబ్స్ ఇస్తోన్న బ్యూటీ
Embed widget