News
News
X

Kavitha Vs Sharmila : ఎమ్మెల్సీ కవితపై షర్మిల ఘాటు విమర్శలు - ఢిల్లీలో ధర్నా అందుకేనా ?

ఎమ్మెల్సీ కవిత పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేత షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

FOLLOW US: 
Share:

Kavitha Vs Sharmila :  మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని భారత  రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత నిర్ణయించుకున్నారు. అయితే ఆమె నిర్ణయంపై మరో మహిళా నేత , వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు  మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ  కవిత కొత్త రాగం ఎంచుకుందని ఆరోపించారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్లుందని విమర్శించారు. 

బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన కవిత మహిళలకే తలవంపు తెచ్చారని అన్నారు. ఇపుడు ఆ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలంటూ ఆరోపించారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని.. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ముందని సూచించారు.  రాష్ట్రంలో రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా మహిళలకు 33 సీట్లు ఎందుకు కేటాయించలేదని కవితను షర్మిల ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో కేసీఆర్ కు అడ్డంకేంటని ప్రశ్నించారు. కేబినెట్ లో పట్టుమని ఇద్దరే మంత్రులు ఉన్నారని..ఇదేనా  మహిళలపై మీకున్న ప్రేమ అని  ఎద్దేవా  చేశారు.

అయితే అసలు ఢిల్లీ లిక్కర్ స్కాంకు...  కవిత చేస్తున్న మహిళా రిజర్వేషన్ పోరాటానికి సంబంధం ఏముందని బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో షర్మిలను ప్రశ్నిస్తున్నారు. సాటి మహిళగా ఉండి.. మహిళా రిజర్వేషన్లపై పోరాటానికి మద్దతివ్వకుండా.. పైగా కించ పరిచేలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కేంద్రాన్ని కవిత ప్రశ్నించవద్దా అంటున్నారు.                      

మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద  మార్చి 10,2023న  భార‌త జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష‌ చేపట్టనున్నారు.  లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించండానికే తాను ఢిల్లీలో ధర్నా చేస్తున్నానన్న విమర్శలపై ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే స్పందించారు. మోడీ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపినప్పుడల్లా సీబీఐ,ఐటీలతో దాడులు చేయిస్తారు అంటూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు బీజేపీకి అలవాటేనంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్లీనరీకి ముందు కూడా ఇలానే జరిగాయని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఐటీదాడులుచేయించారని గుర్తు చేశారు. మార్చి 13 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉంటాయి కాబ‌ట్టి.. ఈ స‌మావేశాల్లోనే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్నామని కవిత చెబుతున్నారు.                

Published at : 03 Mar 2023 06:25 PM (IST) Tags: Telangana Politics Delhi Liquor Scam Sharmila Kalvakuntla's poem women's reservation

సంబంధిత కథనాలు

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

టాప్ స్టోరీస్

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ

Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ