News
News
X

YS Sharmila: ‘అల్లుడు కొత్త సీసా పట్టుకెళ్తే మామ పాత సార పోసిండు’- వైఎస్ షర్మిల ఎద్దేవా

ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్‌ హౌజ్‌కి వెళ్లారని, అందులో తన మామ కేసీఆర్ పాత సారా పోశారని వ్యంగ్యాస్త్రాలు వేశారు.

FOLLOW US: 
Share:

YS Sharmila Comments on Budget: తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా పోసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌ను పనికిరాని పేపర్‌ లాగా మార్చారని, చెత్త బుట్టలో పడేసేలా చేస్తున్నారని కొట్టిపారేశారు. గత బడ్జెట్ కేటాయింపుల మాదిరిగానే ఈ సారి కూడా లెక్కలు చూపించారని షర్మిల విమర్శించారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్‌ హౌజ్‌కి వెళ్లారని, అందులో తన మామ కేసీఆర్ పాత సారా పోశారని వ్యంగ్యాస్త్రాలు వేశారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని, గత ఏడాది బడ్జెట్‌నే కాపీ పేస్ట్ చేశారని ఆరోపించారు. 

గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు కేటాయించారని, దళిత బంధు పథకానికి రూ.17 వేల కోట్ల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా అవే కేటాయింపులు చేశారని, వాటికైనా న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందో లేదో అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కొన్ని పథకాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించి వాటిని ఖర్చు పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. 

ముఖ్యమంత్రి అన్నాక ఇచ్చిన మాటకు విలువ ఉండదా? సీఎం మాటలు మాత్రం కోటలు దాటతాయి. చేతలు మాత్రం గడప దాటవు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పితే మిగతా ప్రాజెక్టులు ఏవీ పూర్తి కాలేదు. రైతు బంధు అని రూ.10 వేలు ఇచ్చి అన్ని సబ్సిడీ పథకాలు బంద్ చేసేశారు. రూ.10 వేలతో రైతును రారాజు చేస్తే ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి?

అలాగే రైతు రుణమాఫీ పథకానికి బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించడంపైన కూడా షర్మిల స్పందించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి రుణమాఫీ కావాలంటే రూ.19 వేల కోట్ల నిధులు కావాలని అన్నారు. కానీ బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. రూ.6 వేల కోట్లతో ఎంతమందికి రుణం మాఫీ చేస్తారని, రాష్ర్టంలో 25 లక్షల మంది రైతులను మోసం చేసినట్లే కదా అని షర్మిల ప్రశ్నించారు. గతేడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు మీద సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేటాయింపులకు, ఖర్చులకు ఎక్కడా పొంతన ఉండడం లేదని విమర్శించారు.

బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా చూపిస్తారని, ఇంత బడ్జెట్ ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు ఎలా బాకీలు పడ్డారని షర్మిల అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ఇంకా కట్టాల్సిన రుణాలు రూ.860 కోట్ల వరకూ ఎలా ఉన్నాయని నిలదీశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో సగం కూడా పూర్తి కాలేదని, ఈ సారి కేటాయించిన రూ.12 వేల కోట్లతో ఈ అన్ని ఇళ్లు కట్టించి ఇస్తారా అని షర్మిల ప్రశ్నించారు.

Published at : 07 Feb 2023 01:21 PM (IST) Tags: YS Sharmila Telangana Budget Harish Rao CM KCR YSRTP News

సంబంధిత కథనాలు

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు-  మంత్రి కేటీఆర్

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

సీతమ్మవారి పెండ్లికి వెండి పీతాంబరం పంపిన సిరిసిల్ల నేతన్న

సీతమ్మవారి పెండ్లికి వెండి పీతాంబరం పంపిన సిరిసిల్ల నేతన్న

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

టాప్ స్టోరీస్

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు