Revanth Reddy : ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదు - రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రాంతాల మధ్య వివక్ష చూపుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో జరిగిన మునుగోడు ఉపఎన్నిక సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని చెప్పారు రేవంత్. ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలు మళ్లీ మునుగోడు ప్రజల ముందుకు వస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రాంతాల మధ్య వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
ఫిరాయింపులు చెల్లవు
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో ఫిరాయింపుల రోగం వచ్చిందని, ఇప్పుడు బీజేపీ కూడా ఫిరాయింపుల ట్రిక్స్ ను ప్లే చేస్తోందని రేవంత్ విమర్శించారు. టికెట్ విషయంలో కాంగ్రెస్ నుంచి అసంతృప్తులు పార్టీ ఫిరాయిస్థాయిని టీఆరెస్, బీజేపీ ఆశించాయని... కాంగ్రెస్ ఐక్యతను చాటడం ఆ రెండు పార్టీలకు చెంపపెట్టు అన్నారు రేవంత్. ఇక పార్టీ ఫిరాయింపుల చెల్లవని మునుగోడు ఉప ఎన్నికల్లోనే సమాధానం చెబుతామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపాడాల్సి ఆ పనిలేదని కార్యకర్తల జోలికొస్తే వాళ్ల మెడలు వంచుతామని హెచ్చరించారు.
చౌటుప్పల్ లో మునుగోడు ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమాల ప్రణాళిక సమావేశం. pic.twitter.com/UxlnCg0wv4
— Revanth Reddy (@revanth_anumula) September 13, 2022
రైతు వ్యతిరేక చట్టాలు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేసి మోదీతో క్షమాపణ చెప్పించే వరకు కాంగ్రెస్ పోరాడిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని, బీజేపీని ఇండియాగేట్ దగ్గర ఉరి తీసినా తప్పులేదన్నారు. నరేంద్ర మోదీకి ఈ దేశాన్ని పాలించే అర్హత లేదని రేవంత్ విమర్శించారు. ఈ ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదని, ఇన్ని మోసాలు చేసిన కేసీఆర్ ను చౌటుప్పల్ చౌరస్తాలో వంద మీటర్ల లోతు గొయ్యిలో పాతిపెట్టినా తప్పులేదన్నారు రేవంత్.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం ఇవ్వాలని మునుగోడు ప్రజలను కోరుతున్నానన్నారు రేవంత్. టీఆర్ఎస్, బీజేపీలను ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ కు పోయేదేంలేదని, ఈ ఎన్నికలకు మోదీకి సంబంధం లేదని రేవంత్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని మునుగోడు ప్రజలకు దండం పెట్టి, పాదాలకు నమస్కరించి కోరుతున్నానన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజల గెలుపు అవుతుందని తెలిపారు.
Also Read : తెలంగాణకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు- కేంద్రంపై మంత్రి హరీష్ ఆగ్రహం
Also Read : TS Politics : ముట్టడిని కట్టడి చేయలేకపోయిన తెలంగాణ పోలీసులు ! ఇంటలిజెన్స్ వైఫల్యం ఉందా ?