అన్వేషించండి

KCR response to SIT notice : మున్సిపల్ ఎన్నికల తరవాతే విచారణకు వస్తా - సిట్‌కు కేసీఆర్ రిప్లయ్

KCR reply to SIT: మున్సిపల్ ఎన్నికల తరవాతే విచారణకు వస్తానని సిట్‌కు కేసీఆర్ రిప్లయ్ ఇచ్చారు. అప్పుడు కూడా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కోరారు.

KCR reply to SIT notice :  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ శుక్రవారం విచారణకు హాజరు కావడం లేదు. ఈ మేరకు సిట్ నోటీసులకు సమాధానం ఇచ్చారు.  బాధ్యతగల పౌరుడిగా.. మాజీ సీఎంగా విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఉన్న పళంగా శుక్రవారమే విచారణకు హాజరు కావాలంటే కాలేనని అన్నారు. విచారణను వాయిదా వేయాలని.. మునిసిపల్ ఎన్నికల తరవాత ఓ తేదీని నిర్ణయించాలన్నారు. అప్పుడు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో విచారించాలని విజ్ఞప్తి చేశారు.   

 నామినేషన్ల బిజీ..   హాజరుకావడం అసాధ్యం 

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు (జనవరి 30న) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలన్న జూబ్లీహిల్స్ ఏసీపీ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని, రేపు (శుక్రవారం) 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నామినేషన్లు వేయడానికి చివరి రోజని ఆయన గుర్తు చేశారు. పార్టీ తరపున అభ్యర్థులకు బి-ఫారాలు, ఇతర అధికారిక అనుమతులు ఇచ్చే ప్రక్రియలో తాను బిజీగా ఉన్నానని, కాబట్టి శుక్రవారం విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. పోలీసు అధికారులు తమకు అనుకూలమైన మరో తేదీని ఖరారు చేయాలని కోరారు.   
KCR response to SIT notice : మున్సిపల్ ఎన్నికల తరవాతే విచారణకు వస్తా - సిట్‌కు కేసీఆర్ రిప్లయ్

 సెక్షన్ 160 CrPC గురించి చెప్పిన గులాబీ బాస్ 

ఈ సందర్భంగా కేసీఆర్ చట్టంలోని నిబంధనలను పోలీసులకు గుర్తు చేశారు. 65 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు లేదా దివ్యాంగులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదని, వారి నివాస స్థలంలోనే విచారించాలని  సెక్షన్ 160 CrPC  స్పష్టం చేస్తోందని ఆయన వివరించారు. తాను ప్రస్తుతం సిద్దిపేట జిల్లా, మర్కూక్ మండలం, ఎర్రవల్లిలోని  ఇంటి నంబర్ 3-96  తన నివాసంలోనే ఉంటున్నానని, చట్ట ప్రకారం అక్కడికే వచ్చి తనను విచారించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నోటీసులు ఏవైనా ఉంటే ఎర్రవల్లి చిరునామాకే పంపాలని సూచించారు.
KCR response to SIT notice : మున్సిపల్ ఎన్నికల తరవాతే విచారణకు వస్తా - సిట్‌కు కేసీఆర్ రిప్లయ్

పూర్తి సహకారం అందిస్తా.. కానీ చట్టబద్ధంగా! 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా, దేశ బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. విచారణ ఎక్కడ జరగాలనే విషయంలో చట్టపరమైన పరిమితులేమీ లేవని, కాబట్టి తన నివాసంలోనే విచారణ జరపడం సమంజసమని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఇప్పుడు బంతి పోలీసుల కోర్టులోకి వెళ్లింది. కేసీఆర్ లేఖపై స్పందిస్తూ సిట్ అధికారులు ఎప్పుడు ఎర్రవల్లికి వెళ్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget