By: ABP Desam | Updated at : 02 Apr 2022 06:21 AM (IST)
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ (Representational Image)
AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అక్కడ 42 కు పైగా డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో ఉక్కపోత, తేమ అధికంగా ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎండలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. రాయలసీమ జిల్లాలలో పోల్చితే ఇక్కడ మూడు నాలుగు డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నాయి. విశాఖపట్నంలో 36 డిగ్రీలు, గన్నవరంలో 35 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కావలిలో 38.5 డిగ్రీలు, నెల్లూరులో 38.7 డిగ్రీలు, సాధారణ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే జంగమేశ్వరపురంలో 37.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైంది. ఉక్కపోత, తేమ ప్రభావం అధికం కావడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీళ్లు అధికంగా తీసుకోవాలని సూచించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉంటోంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప, కోస్తాంధ్రలో మాత్రం కాస్తంత చల్లగా, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 42.3 డిగ్రీలు, అనంతపురంలో 42 డిగ్రీలు, కడపలో 41.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు.
Daily weather report for Andhra Pradesh dated 01.04.2022 pic.twitter.com/nzROfrFK5s
— MC Amaravati (@AmaravatiMc) April 1, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
తెలంగాణలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నాగర్ కర్నూలు, గద్వాల్, మాహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. మరో వైపున ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ లో కూడ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్యలో ఉంది. ఖమ్మం, ములుగు, మహబూబబాద్, నల్గొండ జిల్లాల్లో 40 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత, తేమ అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
Breaking News Live Updates: విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్ఎస్ కౌంటర్
KTR In Davos: తెలంగాణలో హ్యుండాయ్ భారీ పెట్టుబడి- దేశాభివృద్ధికి త్రి ఐ చాలా అవసరమన్న కేటీఆర్
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!