Weather Latest Update: పూర్తిగా వ్యాపించిన రుతుపవనాలు - త్వరలో అల్పపీడనం ఏర్పడే అవకాశం: ఐఎండీ
గత 22వ తేదీన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, 23వ తేదీన తెలంగాణలోని మరికొన్ని భాగాలకు విస్తరించి 24వ తేదీకి తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించాయని తెలిపారు.
ఈ రోజు ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, పరిసరాలలోని ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల వరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుగా వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటలలో వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
గత 22వ తేదీన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, 23వ తేదీన తెలంగాణలోని మరికొన్ని భాగాలకు విస్తరించి 24వ తేదీకి తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఈ రోజు చాలా చోట్ల, రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 83 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.