అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు వడగాలుల అలర్ట్! ఈ జిల్లాల్లో అధికంగా - ఐఎండీ వెల్లడి
ఈ రోజు అదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం , మంచిర్యాల, నల్గొండ, కొత్త గూడెం, సూర్యాపేట,భూపాలపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (జూన్ 13) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఈ రోజు అదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం , మంచిర్యాల, నల్గొండ, కొత్త గూడెం, సూర్యాపేట,భూపాలపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నారాయణ పేట, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వడ గాలులు వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 08 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 59 శాతంగా నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
నేడు ఏపీలో ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీర ప్రాంత జిల్లాలైన మిగతా జిల్లాల్లో సాధారణ వడగాడ్పులు ఉంటాయని అంచనా వేశారు. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు.
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా బిఆర్ అంబేడ్కర్ తెలిపారు. రేపు 188 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 195 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 23 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 248 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 45°C, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44.9°C, కాకినాడ జిల్లా సీతంపేటలో 44.7°C, పల్నాడు జిల్లా రవిపాడులో 44.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 112 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపుఅక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement