Weather Latest Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు, ఈదురుగాలులు కూడా - ఐఎండీ అలర్ట్
Weather Forecast: ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాల చోట్ల మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
Weather Latest News: ద్రోణి ఒకటి మధ్య గుజరాత్ ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఆవర్తనం నుండి మధ్య మహారాష్ట్ర మరియు మరాత్వాడ మీదుగా తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. ఎత్తులో విస్తరించి ఉన్నది. ఆవర్తనం పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని వున్న వాయువ్య బంగాళాఖతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి. మీ. మధ్య కొనసాగుతుంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాల చోట్ల మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు, రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో కూడిన తేలికపాటి నుండి మొస్తారు వర్షాలతో పాటు భారి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
బలమైన ఉపరితల గాలులు 30 నుంచి - 40 కిలో మీటర్ల వేగంతో ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వీచే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 10 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.4 డిగ్రీలుగా నమోదైంది. 70 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఐఎండీ సూచనల ప్రకారం మధ్య గుజరాత్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని, తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు, ఎల్లుండి అక్కడక్కడ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రేపు పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఎల్లుండి పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద ఉండరాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
బధవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 70మిమీ, శ్రీకాకుళం ఎచ్చేర్లలో 68.2మిమీ, అనకాపల్లి జిల్లా పరవాడలో 55.7మిమీ, విజయనగరం జిల్లా రాజాంలో 54.5మిమీ, విజయనగరం జిల్లా సంతకవిటిలో 42మిమీ, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 38.7 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.