అన్వేషించండి

Weather Latest Update: నేడు కూడా కొనసాగనున్న భారీ వర్షాలు! తెలుగు రాష్ట్రాల్లో ముసురు వాతావరణం: ఐఎండీ

Weather Warnings: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం అవకాశం వుంది.

Weather Latest News: జూలై 25న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం ఈరోజు గ్యాంగ్ టక్ పశ్చిమ బెంగాల్, పరిసర బంగ్లాదేశ్ వద్ద సగటు సముద్ర మట్టానికి 7.6 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆగ్నేయ వైపు వంగి ఉన్న అదే ప్రాంతంలో కొనసాగుతున్నది. ఋతుపవన ద్రోణి ఈరోజు గంగానగర్, జైపూర్, గ్వాలియర్, సిద్ది, రాంచి గుండా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల, రేపు  మరియు ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings)

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడ అక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం అవకాశం వుంది.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 30 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 26 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, పశ్చిమ - నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 08 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.6 డిగ్రీలుగా నమోదైంది. 93 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ‘‘నిన్నటి షీర్ జోన్ లేదా గాలుల కోత ఇప్పుడు దాదాపు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1, 7.6 కిలో మీటర్ల మధ్య ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణం వైపునకు వంగి ఉంటుంది. ఇంకా ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి’’ అని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.

జూలై 25న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
తప్పు దిశలో పెట్టిన డెస్క్ పురోగతిని నిరోధిస్తుందా? వాస్తుతో మీ కెరీర్ ఎదుగుదల రహస్యాన్ని తెలుసుకోండి
తప్పు దిశలో పెట్టిన డెస్క్ పురోగతిని నిరోధిస్తుందా? వాస్తుతో మీ కెరీర్ ఎదుగుదల రహస్యాన్ని తెలుసుకోండి
Embed widget