Weather Latest Update: నేడు బలహీనపడ్డ అల్పపీడనం - నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - ఐఎండీ
Weather Warnings: ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. అల్పపీడనం ఈరోజు బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్ మరియు పరిసర ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా కేంద్రీకృతమై ఉంది.
Weather Latest News: జూలై 22న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న అంతర్గత ఒడిశా, పరిసర ఛత్తీస్‌గఢ్ వద్ద కొనసాగిన ప్రస్ఫుటమైన అల్పపీడనం ఈరోజు బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్ మరియు పరిసర ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా కేంద్రీకృతమై ఉన్నది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆగ్నేయ వైపు వంగి ఉన్నది.
ఋతుపవన ద్రోణి ఈరోజు జైసాల్మయిర్, అజ్మీర్, గుణ మరియు తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం గుండా వెళుతూ తూర్పు-మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్నది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల, రేపు మరియు ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిసార్లు మెరుపులు, ఈదురుగాలులతో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో సంభవించే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 25.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.1 డిగ్రీలుగా నమోదైంది. 87 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ‘‘ఉత్తర ఛత్తీస్ గఢ్, పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ పై ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6కిలో మీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది ఆగ్నేయ దిశగా వంగి ఉంది.
సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఆజ్ మేర్ , గుణ, అల్పపీడన ప్రాంత కేంద్రం తూర్పు మధ్య ప్రదేశ్, దానిని ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్, చంద్ బాలీ, ఆగ్నేయ ప్రాంతాల మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్తుంది. సగటు సముద్రంపై 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.
జూలై 22న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.