అన్వేషించండి

Chakali Ilamma: చాకలి ఐలమ్మ పేదల విముక్తి కోసం పోరాడిన వీరనారి! భూమి కోసం సాహసించిన తొలి మహిళ!

Chakali Ilamma: వరంగల్ జిల్లాలోని మారుమూలపల్లెలో రజక కుటుంబంలో జన్మించిన చాకలి ఐలమ్మ స్త్రీలంటే చిన్నచూపు చూసేవారందరికీ కనువిప్పు కలిగించింది.

Chakali Ilamma: భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం అని కమ్యూనిస్టులు చెప్పే సిద్ధాంతం ఒక కులవృత్తి చేసుకునే మహిళ ద్వారా ఉద్భవించిందంటే నమ్మగలరా? స్త్రీలంటే చిన్నచూపు చూసేవారందరికీ చాకలి ఐలమ్మ పోరాటం కనువిప్పు కలిగించింది. పోలీసులను, దేశ్‌ముఖ్‌లను ఎదిరించి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తన పేరును లిఖించుకున్న వీరమాత చాకలి ఐలమ్మ. ఈ పోరాటం తర్వాతే నిజాంకు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం పురుడుపోసుకుంది. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా, ఈ కథనం ద్వారా ఆ వీరవనితను స్మరించుకుంటూ నాటి పరిస్థితులను తెలుసుకుందాం.

చిట్యాల ఐలమ్మే మన వీరమాత చాకలి ఐలమ్మ

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, కిష్టాపురం గ్రామంలో సెప్టెంబర్ 26, 1895 లో రజక కుటుంబంలో జన్మించింది చాకలి ఐలమ్మ. ఆమె తల్లి ఒరుగంటి మల్లమ్మ, తండ్రి సాయిలు. ఐలమ్మకు చిన్నతనంలోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో బాల్యవివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి కులవృత్తి అయిన బట్టలు ఉతకడం ద్వారా జీవనం సాగించేవారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వ్యవసాయం చేయాలని ఈ కుటుంబం నిర్ణయించుకుంది. 

పాలకుర్తి సమీపంలోని మల్లంపల్లికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేయడం ప్రారంభించారు ఐలమ్మ దంపతులు. ఉత్తంరాజు జయప్రదాదేవిది దొరల కుటుంబం. అయితే, స్థానికంగా ఉన్న పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావు కుటుంబానికి, ఐలమ్మ కుటుంబానికి మధ్య ఘర్షణ తలెత్తింది.

అదే సమయంలో ఆ ప్రాంతంలో ఆంధ్ర మహాసభ అనే సంఘం ఏర్పడింది. అందులో ఐలమ్మ సంఘ సభ్యురాలిగా చేరింది. ఇవన్నీ నచ్చని పోలీస్ పటేల్ శేషగిరిరావు, ఐలమ్మను తన పొలంలో పని చేయమని ఒత్తిడి తెచ్చారు. అందుకు ఐలమ్మ నిరాకరించడంతో పటేల్ విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఐలమ్మకు కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయని రామచంద్రారెడ్డికి పోలీస్ పటేల్ శేషగిరిరావు చెప్పడంతో, ఐలమ్మ కుటుంబంపై, కమ్యూనిస్టు నేతలతోపాటు కేసు పెట్టారు. అయితే న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. 

న్యాయస్థానంలో జరిగిన అవమానంతో రగిలిపోయిన పటేల్ శేషగిరిరావు, దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి.. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టి లొంగదీసుకోవాలని కుట్ర చేశారు. పోలీస్ పటేల్ సాయంతో రామచంద్రారెడ్డి, ఉత్తంరాజు జయప్రదాదేవి భూమిని తన పేరు మీద రాయించుకుని, భూమి తనదేనని, తన భూమిలో పండించిన ధాన్యాన్ని తీసుకుపోవడానికి తన మనుషులను ఐలమ్మ భూమిలోకి పంపారు. దీంతో ఆగ్రహించిన చాకలి ఐలమ్మ, రామచంద్రారెడ్డి పంపిన గుండాలపై తిరుగుబాటు చేసింది. రోకలిబండ చేత పట్టుకుని ఆ గుండాలను తరిమికొట్టింది. చాకలి ఐలమ్మ రామచంద్రారెడ్డిపై చేసిన తిరుగుబాటు తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిగా నిలిచింది. ఈ భూపోరాటం మొదలై, సాయుధ పోరాటానికి దారి తీసింది. నిజాం తొత్తులుగా ఉన్నవారి వద్ద నుంచి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది. ఈ సంఘటన తర్వాతే 'భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం' అనే నినాదం ఉద్భవించింది.

చాకలి ఐలమ్మ పోరాట ఫలితాలు ఇవే

ఉత్పత్తి కులంలో పుట్టిన చాకలి ఐలమ్మ ధైర్యంగా విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డిపై చేసిన భూపోరాటం తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని సంఘటనగా నిలిచింది. భూస్వామ్య వ్యవస్థలోని ఓ బలమైన నాయకుడిపై ఒక సామాన్య మహిళ చేసిన పోరాటంగా గుర్తింపు పొందింది. చాకలి ఐలమ్మ ధైర్యంతో అనేకమంది మహిళలు, ఉత్పత్తి కులాల వారు భూపోరాటంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ తొలి భూపోరాట వీరురాలిగా చాకలి ఐలమ్మ పేరు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో లఖితమైంది..

చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన తర్వాత నిరాడంబర జీవితాన్ని గడిపారు. 10సెప్టెంబర్  1985న ఆమె మరణించారు. ఆమె జయంతి, వర్ధంతిలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ తెలంగాణ అమరులను గుర్తు చేసుకునేలా ఘనంగా నిర్వహిస్తోంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget