అన్వేషించండి

Parvathagiri Shivalayam Jathara: ఈనెల 26న పర్వతగిరి శివాలయం పునః ప్రతిష్టాపన - మూడ్రోజుల పాటు జాతర

Parvathagiri Shivalayam Jathara: వరంగల్ లోని పర్వతగిరి శివాలయం పునః ప్రతిష్టాపనను ఈనెల 26వ తేదీని నిర్వహింబోతున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మూడ్రోజుల పాటు ఘనంగా జాతర సాగుతుందని వివరించారు. 

Parvatagiri Shivalayam: కాకతీయుల కాలంలో నిర్మించి, 700 సంవత్సరాల చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పర్వతగిరి శివాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహించబోతున్నారు. అయితే ఆరోజు నుంచి మూడ్రోజుల పాటు(26, ,27,28వ తేదీల్లో) అత్యంత వైభవంగా జాతర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  కూడా ఉన్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆలయ పునః ప్రతిష్టాపన చేస్తున్నామని, దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఇంటి నుంచి తెచ్చిన జలంతో శివుడికి అభిషేకం చేయాలని కోరారు.

Parvathagiri Shivalayam Jathara: ఈనెల 26న పర్వతగిరి శివాలయం పునః ప్రతిష్టాపన - మూడ్రోజుల పాటు జాతర

ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పునః ప్రతిష్టాపన కార్యక్రమంపై మంత్రి ,ఎమ్మెల్యే జిల్లా శాఖ అధికారులతో శివాలయం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందు పర్వతాల శివాలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన దాదాపు 700 మెట్లను ఎక్కి పరిసర ప్రాంతాలను, భక్తుల వసతులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఎలక్ట్రిసిటీ లైన్స్ కు శంకుస్థాపన చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని అదేశాలు జారీ చేశారు. శివాలయానికి మూడు రోజుల్లో, వేలు, లక్షల్లో భక్తులు వస్తారని, శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

పర్వతగిరి రిజర్వాయర్ ను లోయర్ మానేర్ డ్యాంను జాతర నాటికి నీటితో నింపాలని దేవాదుల చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. రిజర్వాయర్ లో భక్తుల ఆహ్లాదం కోసం బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరిజం శాఖ అధికారులను కోరారు. మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో వారి ఆరోగ్య పరిరక్షణ కోసం తగినన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. పర్వతాల శివాలయం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్వతగిరి నుంచి గుట్ట వరకు తగినని బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Parvathagiri Shivalayam Jathara: ఈనెల 26న పర్వతగిరి శివాలయం పునః ప్రతిష్టాపన - మూడ్రోజుల పాటు జాతర

గుట్టమీదకు వెళ్లేందుకు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు..

 గుట్టమీదికి వెళ్లడానికి వృద్ధులకు వాహన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. జాతరలో భక్తి భావం పెంపొందించే విధంగా శివుడి మీద పర్వతాల శివాలయం కోసం ప్రత్యేకంగా పాటలు రాయించి నేడు విడుదల చేశారు. జాతర సందర్భంగా సింగర్స్ సునీత, మంగ్లీ, మధుప్రియలను రప్పించే ప్రయత్నం చేయాలని కమిటీ నిర్వాహకులకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు, పార్కింగ్ వసతులకు పోలీసులు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఇప్పటికే ముద్రించిన శివాలయ జాతర కరపత్రాలను చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ వెళ్లి ఇంటింటికి ఆహ్వానించాలని సూచించారు.

Parvathagiri Shivalayam Jathara: ఈనెల 26న పర్వతగిరి శివాలయం పునః ప్రతిష్టాపన - మూడ్రోజుల పాటు జాతర

జాతరకు వచ్చే భక్తులు తమ ఇంటి నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి శివునికి అభిషేకించాలని ప్రత్యేకంగా కోరారు. ప్రతిష్టాత్మకంగా పునః నిర్మాణం చేసి ప్రారంభించుకుంటున్న ఈ పవిత్ర కార్యాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని.. ఆ శివుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, మిషన్ భగీరథ, పోలీస్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget