Warangal MP: వరంగల్‌లో 40ఏళ్ల తర్వాత మహిళా ఎంపీ, ఇద్దరిలోనూ కామన్ ఫ్యాక్టర్ ఇదే!
Telangana News: వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో సుదీర్ఘకాలం తరువాత 2024 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి మరో మహిళకు చట్ట సభలకు వెళ్లే అవకాశం వచ్చింది.
Warangal MP Kadiyam Kavya: చరిత్రాత్మక వరంగల్ పార్లమెంటు ఎంపీగా 4 దశాబ్దాల తర్వాత మహిళ పార్లమెంట్ లో అడుగుపెడుతోంది. 1984లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి మహిళ ప్రాతినిథ్యం వహించింది. సుదీర్ఘకాలం తరువాత 2024 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుండి మరో మహిళకు చట్టసభలకు వెళ్లే అవకాశం వచ్చింది. మరో విశేషమేమిటంటే ఇద్దరూ డాక్టర్లే. ఆ మహిళా ఎంపీలే ఒకరు డాక్టర్ కల్పనా దేవి కాగా మరొకరు డాక్టర్ కడియం కావ్య.
1980 దశకంలో రాజకీయాల్లో మహిళలకు అంతంత ప్రాధాన్యత ఉన్న సమయంలో డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న కల్పన దేవి 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన కల్పన దేవి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమాలుద్దీన్ హమ్మద్ పై 8 వేల 456 ఓట్ల తో విజయం సాధించింది. కొత్తగా వచ్చిన తెలుగు దేశం పార్టీ కి తోడు మహిళగా వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగింది.
2024 లో మహిళకు అవకాశం
1984లో కల్పన దేవి తరువాత ఎంపీ గా వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి మహిళకు అవకాశం రాలేదు. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనేక రాజకీయ పరిణామాల మధ్య కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబడింది. కావ్య అభ్యర్థిత్వం పై అనేక ఆరోపణలు, ప్రత్యర్థులు విమర్శలు తీవ్ర రాజకీయ చర్చకు దారితీసాయి. గెలుపే కష్టమనుకున్న సమయంలో 2 లక్షల 19 వేల 691 ఓట్ల మెజార్టీ తో రికార్డు సృష్టించింది. సమీప బిజేపి అభ్యర్థి ఆరూరి రమేష్ పై విజయం సాధించింది. 40 సంవత్సరాల తరువాత రాణి రుద్రమ వారసురాలిగా పార్లమెంటులో అడుగుపెడుతుంది.
ఇద్దరు డాక్టర్లే
కల్పన దేవి రాజకీయాల్లోకి రాకముందు. వరంగల్ నగరంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తూ డాక్టర్ గా కొనసాగుతుంది. తెలుగు దేశం పార్టీ ఏర్పాటు తో రాజకీయాల్లో వచ్చిన కల్పన దేవి 1984 ఎన్నికై ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ లో చేరి సుదీర్ఘ కాలం వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొనసాగారు. 2O24 లో గెలిచిన కడియం కావ్య సైతం డాక్టర్. వైద్య విద్యను పూర్తి చేసిన కావ్య ప్రభుత్వ వైద్యురాలిగా కొనసాగుతూ తండ్రి కడియం శ్రీహరి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు.1984 లో 2024 లో వరంగల్ పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు.
2008 లో మహిళకు అవకాశం
కల్పన దేవి తరువాత 2008 లో వరంగల్ పార్లమెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున కొండ సురేఖ పోటీ చేసే అవకాశం వచ్చినా విజయం సాధించలేదు.