అన్వేషించండి

Warangal Student Suicide: ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య!

Warangal Student Suicide: వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది. ఉంగరం పోవడంతో తల్లిదండ్రులు తిడతారని భయరడిన ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 

Warangal Student Suicide: హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. అయితే అమ్మా నాన్నలు చేయించిన ఉంగరం ఇటీవలే పోయింది. ఉగాది సెలవుల కోసం ఇంటికి వచ్చింది. అయితే ఉంగరం పోయిన విషయం గుర్తించి తల్లిదండ్రులు తిడతారేమోనని భయపడ్డ ఆమె.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఉరివేసుకుంది. 

అసలేం జరిగిందంటే..?

వరంగల్ జిల్లా గున్నెపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకీ రామ్ కూతురు.. 19 ఏళ్ల మద్దుల హేమలతా రెడ్డి హన్మకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే ఇంటి నుంచి వెళ్లి రావడం కష్టంగా ఉందని హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. ఇటీవలే ఉగాది పండుగ కోసం ఇంటికి వచ్చిన హేమలతా రెడ్డి చేతి ఉంగరం పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. తల్లిదండ్రులు ఏమంటారోనని భయపడిపోయింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సూసైడ్ లెటర్ రాసింది. అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. ఉంగరం పోగొట్టుకున్నాను.. మీరేమంటారోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. వెంటనే ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

వేల రూపాయల విలువ చేసే ఉంగరం కోసం కోట్ల రూపాయల విలువ చేసే ప్రాణమెలా తీసుకున్నావు తల్లీ అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇంత చిన్న విషయానికి భయపడి మాకు అందనంత దూరమవుతావా తల్లీ అంటూ రోదిస్తున్న తీరు.. స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎస్సై కూచిపూడి జగదీష్ వివరించారు. 

నిన్నటికి నిన్న హైదరాబాద్ లో జంట ఆత్మహత్య

హైదరాబాద్ జగద్గిరిగుట్ట శివనగర్ లో దారుణం చోటుచేసుకుంది.  ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న అనిల్ అలియాస్ అనూష, గణేష్ ల సోమవారం ఉరివేసికుని బలవన్మరణానికి పాల్పడ్డారు. టాన్స్ జెండర్ అనూష, గణేష్ లు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు.  

పెళ్లైన రెండేళ్లకే దారుణం 

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నగర్ లో దారుణం జరిగింది. పెళ్లైన రెండేళ్లకే దంపతులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ కి చెందిన అనూష(25) ,గణేష్(25) ఇద్దరు జగద్గిరిగుట్ట శివ నగర్ లో నివాసముంటూ లేబర్ పని చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
AP Cabinet : రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
Nara Lokesh:  రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Kancha Gachibowli Lands Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs SRH Match Preview IPL 2025  ఈడెన్ లో దుల్లగొట్టేసి ఫామ్ లోకి వచ్చేయాలని సన్ రైజర్స్Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడాSiraj Bowling vs RCB IPL 2025 | మియా మావ బౌలింగ్ కి..వణికిపోయిన ఆర్సీబీRCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
AP Cabinet : రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
Nara Lokesh:  రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Kancha Gachibowli Lands Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
India IT Sector: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్‌తో భారత్ ఐటీకి గడ్డు కాలం - మాస్ లే ఆఫ్స్ తప్పవా?
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్‌తో భారత్ ఐటీకి గడ్డు కాలం - మాస్ లే ఆఫ్స్ తప్పవా?
Hansika Motwani: గృహ హింస కేసులో హైకోర్టును ఆశ్రయించిన నటి హన్సిక - తనపై కేసు కొట్టేయాలని విజ్ఞప్తి
గృహ హింస కేసులో హైకోర్టును ఆశ్రయించిన నటి హన్సిక - తనపై కేసు కొట్టేయాలని విజ్ఞప్తి
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
AP Cabinet decisions: మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ పోర్టు - బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ పోర్టు - బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget