అన్వేషించండి

Warangal: ప్రభుత్వ హాస్టల్‌లో లిక్కర్! పదో క్లాస్ స్టూడెంట్స్ బీరు పార్టీ

Telangana News: ప్రభుత్వ హాస్టల్స్ లో మద్యం ఏరులై పారుతోంది. పది కూడా పాసవ్వని విద్యార్థులు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటూ బీరు బాటిళ్లు తెచ్చుకోవడం ఇప్పుడు కలకలం రేపింది.

Liquor in Hostels: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో మద్యం రాజ్య మేలుతుంది. నిన్న సూర్యాపేట జిల్లాలో ప్రిన్సిపాల్ రూంలో బీర్ బాటిళ్లు దొరికాయి. ఈ ఘటన మరువకముందే కొద్ది గంటల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూర్ బీసీ హాస్టల్ లో మద్యం బాటిళ్లు కనిపించాయి.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలోని బీసీ హాస్టల్ లో అర్ధరాత్రి బీర్ బాటిళ్లు దర్శనమిచ్చాయి. బీసీ హాస్టల్ పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పుట్టిన రోజు. దీంతో హాస్టల్ వార్డెన్ లేని సమయంలో తోటి విద్యార్థులు కేక్ కట్ చేసిన అనంతరం హాస్టల్ లోనే పార్టీ చేసుకున్నారు. అయితే కేక్ పార్టీ కాదు. మద్యం పార్టీ చేసుకున్నారు విద్యార్థులు. బీరు బాటిళ్లు హాస్టల్ కు తెచ్చుకొని తాగుదామనే టైంలో హాస్టల్ పక్కన నివాసం ఉంటున్న స్థానికులు చూసి విద్యార్థులను మందలించారు. దీంతో  విద్యార్థులు అక్కడి నుంచి పరారైపోయారు. దీంతో బీర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్ ఎక్కడివడే ఉన్నాయి. ఈ ఘటన అర్థరాత్రి 11 గంటల తరువాత జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. అయితే పాలకుర్తి ఎమ్మెల్యే సొంత గ్రామం చర్లపాలెం కావడం గమనార్హం.

ప్రిన్సిపల్ గదిలో బీర్లు
కొద్ది గంటల ముందే సూర్యాపేటలోనూ ఇలాంటి ఘటన వెలుగు చూసింది. సూర్యాపేటలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ గదిలో లిక్కర్ బాటిళ్లు కనిపించాయి. బాలికల నిరసనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ తరచూ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుంచి ఆ కాలేజీ బాలికలు ఆందోళన చేపట్టారు. గత శనివారం మహిళా ప్రిన్సిపాల్‌ గదిలో నాలుగు బీరు బాటిళ్లు కనిపించడంతో ఆ రూమ్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్‌ శైలజ తమతో బాగా కఠినంగా ఉంటున్నారని.. ఆఖరికి తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదని బాలికలు వాపోయారు. ప్రశ్నిస్తే తమపై చేయి చేసుకుంటున్నట్లు ఆవేదన చెందారు. 

ప్రిన్సిపల్‌ శైలజ తన గదిలోనే కేర్‌ టేకర్‌ సౌమిత్రితో కలిసి మందు తాగుతారని బాలికలు ఆరోపించారు. తమ సమస్యలపై ప్రశ్నిస్తే మాత్రం పట్టించుకోరని అన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. ఆర్డీవో వేణుమాధవరావు సహా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డీఎస్పీ రవికుమార్‌, సీఐ రాజశేఖర్‌, రూరల్‌ ఎస్సై బాలునాయక్‌ తదితరులు కాలేజీకి చేరుకుని బాలికలతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్‌ చేశారు.                

మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సీరియస్‌
ప్రిన్సిపల్‌ గదిలో బీరు సీసాల ఘటనపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని కలెక్టర్‌ ను ఆదేశించారు. ఓ కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్‌ లత, సభ్యులుగా జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, ఆర్డీవో వేణుమాధవ్‌, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి లత ఉన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Embed widget