Revanth Reddy: జగ్గారెడ్డి సమస్య టీకప్పులో తుపాను లాంటిదన్న రేవంత్
ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నట్టే కాంగ్రెస్‌లో కూడా ఇబ్బందులు ఉంటాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్. జగ్గారెడ్డి సమస్య పెద్దదేం కాదని అంతా సర్ధుకుంటుందన్నారాయన.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి(Jaggareddy) ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈ సమస్య టీ కప్పులో తుపాను లాంటిదన్నారపు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలోనూ బేధాభ్రిప్రాయాలు ఉంటాయన్నారు రేవంత్. కాంగ్రెస్(Congress) ది భిన్నత్వంలో ఏకత్వమన్న రేవంత్ ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ: రేవంత్
కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందన్న రేవంత్ అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. పోలీసులపై మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావన్నారు రేవంత్. ఆవేశంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. కానీ అలా మాట్లాడకుండా ఉండాల్సింది కాదని పశ్చాత్తాప్పడ్డారు.
సమ్మక్క సారలమ్మే స్ఫూర్తి: రేవంత్
ఏమైనా సరే సమ్మక్క సారలమ్మల(Sammakka Saralamma) పోరాటమే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో పోరాడుతామన్నారు పీసీసీ చీఫ్(PCC Chief). తెలంగాణ ఉద్యమానికి కూడా వాళ్లే స్ఫూర్తని అభిప్రాయపడ్డారు రేవంత్. అలాంటి మేడారం మహాజాతరకు ప్రపంచ గుర్తింపు రావాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.
ఆ విగ్రహానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వలేదు: రేవంత్
కేసీఆర్ (KCR)ప్రభుత్వం మేడారం జాతరను విస్మరించిందని ధ్వజమెత్తారు పీసీసీ చీఫ్. సమ్మక్క పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అత్మగౌరవాన్ని కించపరిచారని మండిపడ్డారు. సమ్మక్క చరిత్రను కనుమరుగు చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామి, రామేశ్వరరావు నిర్మించిన ఆలయాలకు ఇచ్చిన విలువ.. సమ్మక్క జాతరకు ఇవ్వలేదన్నారు.
మేడారం జాతరను చిన్నగా చూపే కుట్ర:రేవంత్
కృత్రిమమైన కట్టడం దగ్గర పొర్లుదండాలు పెట్టిన కేసీఆర్ కుటుంబం... మేడారం జాతరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు రేవంత్. ముచ్చింతల్(Muchchintal) కు వచ్చిన ప్రధాని మోదీ(Modi) మేడారం ఎందుకు రాలేదని నిలదీశారు. సీఎం, పీఎం మేడారం జాతరను చిన్నగా చేసి చూపే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మేడారం జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నించాలి: రేవంత్
కాంగ్రెస్, బీజేపీకి ఆదివాసీల ఓట్లే కావాలి కానీ మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇచ్చే ఉద్దేశం లేదన్నారు రేవంత్. మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.
సీతక్కకు ప్రత్యేక గుర్తింపు: రేవంత్
ప్రతీ మేడారం మహాజాతరకు రూ. 500 కోట్లు కేటాయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణలో జిల్లాలను అస్తవ్యస్తంగా మార్చేశారని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నింటినీ సరి చేస్తామన్నారు రేవంత్. ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరుపెడతామన్నారు. సీతక్క(Seetakka) సంతకంతోనే ములుగు జిల్లాను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 12 నెలల తర్వాత తెలంగాణలో సోనియమ్మరాజ్యం వస్తుందని ఆ రాజ్యంలో సీతక్కకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు రేవంత్