IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Warangal: రేప్ కేసు నిందితుడు రాజు అంత్యక్రియలు పూర్తి.. ఊళ్లోకి రానివ్వని గ్రామస్థులు, చివరికి..

కుమారుడి చితికి తల్లి వీరమ్మ నిప్పటించారు. ఆ సమయంలో భార్య కూడా హాజరయ్యారు. అయితే, నిందితుడి పోస్టుమార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానుంది.

FOLLOW US: 

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతదేహానికి వరంగల్‌లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై ఇవాళ (సెప్టెంబరు 16) ఉదయం రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో బంధువుల సమక్షంలో పోస్టు మార్టం పూర్తి చేశారు. అనంతరం రాజు శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరంగల్‌ పోతన నగర్‌లోని శ్మశాన వాటికలో రాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

కుమారుడి చితికి తల్లి వీరమ్మ నిప్పటించారు. ఆ సమయంలో భార్య కూడా హాజరయ్యారు. అయితే, నిందితుడి పోస్టుమార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానుంది. రాజు మృతదేహానికి గంటపాటు ఫోరెన్సిక్ డాక్టర్లు రజా మాలిక్, ఫోరెన్సిక్ వైద్యుడు, వరంగల్ ఎంజీఎం రాజు పోస్టుమార్టం చేశారు.

అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. మృతదేహంపై రైలు గుద్దిన గాయాలు, గ్రీజు ఉన్నాయని చెప్పారు. రైల్వే ప్రమాదం గాయాలను గుర్తించినట్లు తెలిపారు. మృతదేహంపై ఇతర గాయాలు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించినట్లు వివరించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం వీడియో తీసినట్లుగా చెప్పారు. డీఎన్ఏ పరీక్ష కోసం రాజు ఎముకలు సేకరించినట్లు పేర్కొన్నారు. రాజు మత్తు పదార్థాలు సేకరించాడా అనేది పరిశీలిస్తున్నట్లుగా వైద్యులు వెల్లడించారు.

నిరాకరించిన గ్రామస్థులు
రాజు స్వగ్రామం ఆత్మకూరు మండలం అడ్డగూడూరుకు ఆ శవాన్ని తీసుకెళ్లాలని తొలుత భావించారు. కానీ, ఆ గ్రామస్తులు శవాన్ని ఊళ్లోకి రానిచ్చేందుకు నిరాకరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారీ పోలీసు బందోబస్తు నడుమ వరంగల్‌లోనే అంతిమ సంస్కారం నిర్వహించారు.

Also Read: Rape Accused Death: కామాంధుడు రాజు మృతిపై తల్లి సంచలన ఆరోపణలు.. భార్య కూడా, మరోలా మాట్లాడిన అత్త

అంబులెన్స్‌పై చెప్పులు, రాళ్లతో దాడి
అంతకుముందు, రాజు శవాన్ని పోస్టు మార్టం కోసం పోలీసులు వరంగల్‌ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మార్చురీకి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ మృతదేహాన్ని కాజీపేట రైల్వే సీఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో రాజు శవాన్ని అంబులెన్స్‌లో ఎక్కించి ఎంజీఎం మార్చురీకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు మృత దేహాన్ని తరలిస్తున్న క్రమంలో అంబులెన్స్‌పై పలువురు చెప్పులు, రాళ్లు విసిరారు. వారిని భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎంజీఎం ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Also Read: Petrol Attack: ఫారెస్ట్ ఆఫీసర్‌పై పెట్రోల్‌తో దాడి.. భూపాలపల్లిలో షాకింగ్ ఘటన

Also Read: TSRTC: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీల‌క నిర్ణయం.. ఇక బస్సులపై అవన్నీ కనిపించవ్

Published at : 16 Sep 2021 10:52 PM (IST) Tags: warangal news saidabad rape case raju final rights raju postmortem

సంబంధిత కథనాలు

TS Inter Results 2022 Live Updates: నేడే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి

TS Inter Results 2022 Live Updates: నేడే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి

Weather Updates: ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Weather Updates: ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

TS Inter Results 2022: నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TS Inter Results 2022: నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

Vikarabad News : 48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?

Vikarabad News : 48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టీఎస్ టెట్ 2022 ఫలితాలు లేనట్లే !

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టీఎస్ టెట్ 2022 ఫలితాలు లేనట్లే !

టాప్ స్టోరీస్

Hyderabad Traffic News: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఈ మార్గాల్లో అస్సలు వెళ్లొద్దు!

Hyderabad Traffic News: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఈ మార్గాల్లో అస్సలు వెళ్లొద్దు!

Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

KCR to Raj Bhavan: నేడు కొత్త సీజే ప్రమాణ స్వీకారం, సీఎం KCR రాజ్ భవన్‌కు వెళ్తారా?

KCR to Raj Bhavan: నేడు కొత్త సీజే ప్రమాణ స్వీకారం, సీఎం KCR  రాజ్ భవన్‌కు వెళ్తారా?

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!