By: ABP Desam | Updated at : 16 Sep 2021 04:24 PM (IST)
Edited By: Venkateshk
నిందితుడు రాజు, తల్లి వీరమ్మ
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు పులికొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అతను స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్ సమీపంలో రైలు కింద పడి చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్లు, ఇతర గుర్తుల ఆధారంగా చనిపోయింది రాజు అని పోలీసులు కనుగొన్నారు. అయితే, రాజు ఆత్మహత్య వ్యవహారంపై అతని తల్లి వీరమ్మ సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. గురువారం ఆమె ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు.
నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రకటించడంపై అతని తల్లి వీరమ్మ అనుమానం వ్యక్తం చేస్తోంది. నల్గొండ జిల్లా అడ్డగూడురు మండలం కేంద్రంలో ఆమె ఉన్నారు. పోలీసులే తన కొడుకుని ఉరికించి ఉరికించి చంపేశారని వీరమ్మ ఆరోపించింది. తన కొడుకు కొద్ది రోజుల క్రితమే పోలీసులకు దొరికాడని పోలీసులే చంపేశారని సంచలన ఆరోపణలు చేశారు.
‘‘నా కొడుకు రాజు 3 రోజుల కిందటే రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చిక్కాడని పోలీసులే చెప్పారు. రాజును ఎన్ కౌంటర్ చేయాలని పై నుంచి ఆర్డర్ వచ్చిందని వాళ్లే మాట్లాడుకుంటుంటే మేం విన్నాం. నిన్న మొత్తం మా వివరాలన్నీ రాసుకున్నారు. మూడు రోజుల నుంచి స్టేషన్‌లో ఉన్నా ఎవరూ రాలేదు. నిన్న ఒక్కసారిగా అందరూ వచ్చారు. అప్పుడే మాకు డౌట్ వచ్చి అడిగితే దొరకలేదని బుకాయించారు. మిమ్మల్ని వదిలేస్తున్నాం అని నిన్న రాత్రి 10 గంటలకు మమ్మల్ని ఉప్పల్‌లో వదిలిపెట్టారు. పోలీసులే నా కొడుకును ఉరికించి చంపేశారు. వాళ్లకు 3 రోజుల కిందటే రాజు దొరికినా ఈ రోజు మమ్మల్ని ఇటు పంపించి వాడిని అక్కడ చంపేశారు.’’ అని ఆమె రోదిస్తూ చెప్పారు. రాజును పోలీసులే పొట్టనపెట్టుకున్నారని విలపించారు.
‘‘ఇక మొత్తం అయిపోయింది. మా కొడుకు శవం మాకియ్యండి సార్. పోలీసులే నా కొడుకుని చంపేశారు’’ అంటూ విలేకరులతో రాజు తల్లి వీరమ్మ రోధిస్తూ మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో ఘటన జరిగిన తెల్లారే మా ఇంటికి పోలీసులు వచ్చిన్రు. మమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు. ఏడు రోజులు స్టేషన్‌లోనే ఉంచారు. మూడు రోజుల ముందే దొరికాడన్నారు.. మళ్లి దొరకలేదన్నారు. ఏడు రోజులు మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచి నిన్న రాత్రే మమ్మల్ని వదిలిపెట్టారు.’’ అని రాజు భార్య మౌనిక అన్నారు.
‘‘ఇక మొత్తం అయిపోయింది. మా కొడుకు శవం మాకియ్యండి సార్. పోలీసులే నా కొడుకుని చంపేశారు’’ అంటూ విలేకరులతో రాజు తల్లి వీరమ్మ రోధిస్తూ మాట్లాడారు.
నా బిడ్డను ఆగం చేసిండు
రాజు అత్త (భార్య తల్లి) మాట్లాడుతూ.. ‘‘ఎన్నడు ఇట్ల జరగలేదు. వాడికి ఏం పోయేకాలం వచ్చిందో నా బిడ్డను ఆగం ఆగం చేసిండు. నా బిడ్డ రాత్రే వచ్చి అడ్డగూడూరులో ఉంది.’’ అని నిందితుడ్ని దూషిస్తూ మాట్లాడింది.
Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య
Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!
Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..
Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?
Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!