Mallareddy: సమ్మక్కకు మొక్కిన, కేసీఆర్ కచ్చితంగా ప్రధాని అయితరు - ఇట్లనే దేవతలు నాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన్రు: మంత్రి మల్లారెడ్డి
Sammakka Saralamma Jatara: ‘నేను మేడారం తొలిసారి వచ్చినప్పుడు ఓ మెడికల్ కాలేజీ కావాలని సమ్మక్క సారలమ్మకు మొక్కుకున్నా. ఆ దేవతలు నేను మెడికల్ కాలేజీ పెట్టేలా దీవించారు.’ అని మల్లారెడ్డి అన్నారు.
మంత్రి మల్లారెడ్డి శుక్రవారం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రతి రెండేళ్లకు ఓసారి తప్పకుండా మేడారం వనదేవతలను దర్శించుకుంటానని అన్నారు. తన కోరికలు అన్నింటినీ అమ్మవార్లు గతంలో తీర్చారని గుర్తు చేసుకున్నారు. గత 14 ఏళ్ల నుంచి ఇప్పటి దాకా ఏడు సార్లు అక్కడికి వచ్చినట్లు చెప్పారు.
‘‘నేను ఏది మొక్కినా ఇక్కడ నేను సక్సెస్ అయిన. నేను మేడారం ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఓ మెడికల్ కాలేజీ కావాలని సమ్మక్క సారలమ్మకు మొక్కుకున్నా. ఆ దేవతలు నేను మెడికల్ కాలేజీ పెట్టేలా దీవించారు. ఆ తర్వాత ఎంపీ అవ్వాలని మొక్కుకున్నా. ఆ దేవతలు ఆ పదవి కూడా నాకు వచ్చేలా చేశారు. ఈ సారి మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుకున్నా. ఎందుకంటే ఇప్పుడు దేశం అల్లకల్లోలంగా ఉంది. పరిస్థితి చాలా బాగాలేదు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కరెంటు లేదు. నీళ్లు లేవు. రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడేళ్ల కాలంలో కేసీఆర్ తెలంగాణలో మంచి పథకాలు తెచ్చి పెట్టారు. ఇప్పుడు రాష్ట్రం చాలా బాగుంది. రైతుల కోసం తెలంగాణలో సాగునీరు, తాగునీరు, రైతు బంధు వంటి ఎన్నో పథకాలు కేసీఆర్ తెచ్చారు. ఇలాగే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రధాన మంత్రి అయితే దేశాన్ని కూడా ఇలాగే నడిపిస్తారు.’’
‘‘బీజేపీ, కాంగ్రెస్ అంటే ప్రజలకే చిరాకు అయిపోయింది. ఇతర పార్టీల అధినేతలకు అందరూ కేసీఆర్ వెంటనే ఉంటారు. ఆయన ప్రధాన మంత్రి కావాలని నేను వన దేవతలకు మొక్కిన.. కచ్చితంగా కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతరు.’’ అని మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు.
ఐటీ పార్కు ప్రారంభోత్సవంలోనూ భావోద్వేగ ప్రసంగం
గురువారం (ఫిబ్రవరి 17)న కండ్లకోయలో జరిగిన ఐటీ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ప్రసంగిస్తూ భావోద్వేగం చెందిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు తాను పాలు అమ్మి జీవనం సాగించానని గుర్తు చేసుకున్నారు. అలాంటి తాను గతంలో పార్లమెంటు సభ్యుడు, ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగానని అన్నారు. నిరంతరం కష్టపడడం వల్లే దేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్‌గా అయ్యానని గుర్తు చేసుకున్నారు. సక్సెస్‌కు ఒక మోడల్‌గా నిలిచాను అని అన్నారు. ‘‘నా జన్మలో కూడా ఊహించలేదు. సీఎం కేసీఆర్ ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారని. ఒకప్పుడు ఐటీ అంటే మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ.. ఇప్పుడు ఐటీ కంపెనీలు కూడా హైదరాబాద్‌కు నార్త్ సైడ్ విస్తరిస్తున్నాయి. ఒక లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మేడ్చల్‌లో ఉన్నారు. ఐటీ పార్కు ఇక్కడ నెలకొల్పడం మా పిల్లల అదృష్టం. రాబోయే రోజులు మీవే’’ అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
మేడారం జాతర దక్షిణ భారత కుంభమేళ, సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షింస్తూ ఆ అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకుని, నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. pic.twitter.com/DdLoXCNcpC
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) February 18, 2022