Harish Rao: మెడికల్ విద్యార్థులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్
Harish Rao: వైద్య విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే బీ కేటగిరీలో లోకల్ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పీజీ సీట్లను 40 వరకు పెంచుతామన్నారు.
Harish Rao: వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ క్రమంలోనే సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కలాశాలలో నిర్వహించిన మెడ్ ఎక్స్ పో కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనను కళ్లారా తిలకించారు. అనంతరం మాట్లాడుతూ... గతంలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్, రష్యాకు వెళ్లి చదువుకునే వారని గుర్తు చేశారు, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో సిద్ధిపేటలో రూ.15 కోట్లతో క్యాథలాబ్ గుండె చికిత్స, రేడియో థెరపీ సేవలకు అనుగుణంగా క్యాన్సర్ చికిత్స అందిస్తామన్నారు. సిద్దిపేటలో 900 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. మూడేళ్ల నుంచి కరోనా వల్ల ఎక్కడా మెడ్ ఎక్స్ పో జరగలేదని వెల్లడించారు. రానున్న రోజుల్లో బీ కేటగిరీలో లోకల్ రిజర్వేషన్లు అమలు చేస్తామని, పీజీ సీట్లను 40 వరకు పెంచుతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
"ప్రజల్లో అవగాహన పెరగాలనే ఉద్దేశంతోనే మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రదర్శన ప్రారంభించారు. మీరంతా వెళ్లి చూడండి. గుండె ఎట్ల పని చేస్తదో లైవ్ లో చూడొచ్చు. ఈరోజు, రేపు మాత్రమే ఉంటది. పది నిమిషాల్లో వచ్చేదామని పోయిన తర్వాత అక్కడ తెలియని విషయాలు తెలుసుకునేలోపే గంట అయిపోయింది. అందరూ ఓసారి వెళ్లి చూసి రండి. ఉచితంగా వెళ్లి చూడొచ్చు. ఎలాంటి డబ్బులు తీసుకోరు. అన్ని చూసి కొత్త విషయాలు నేర్చుకొని రండి." - హరీష్ రావు, మంత్రి
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈనెల 16, 17వ తేదీల్లో వైద్య విద్య పట్ల ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన కోసం వైద్య విద్య ప్రదర్శన నిర్వహిస్తున్నామని... కళాశాల విద్యార్ఖులు తెలిపారు. దీని ద్వారా వైద్యంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, వ్యాధుల నిర్మూలన గురించి అవగాహన కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ ఎగ్జిబిషన్ లో మానవ శరీరంలోని ముఖ్యమైన అవయాలు, వాటి విఘులు, మానవ అవయవ వ్యవస్థ నిర్మితులు మొదలగు అంశాలతో అవగాహన కల్పిస్తున్నారు. పట్టణ ప్రాంత ప్రజలు, విద్యార్థులు వచ్చి ఈ వైద్య విద్య ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు.
Ukraine Returned Students: ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు భారత్‌లో సీటు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం వెల్లడించింది. సుప్రీం కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వచ్చి ఇక్కడ వైద్య విద్యను కొనసాగించేందుకు అనుమతి కోరిన వారికి ఆ మేరకు పర్మిషన్ ఇవ్వలేమని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. జస్టిస్ హేమంత్ గుప్తా నేతృత్వం వహిస్తున్న సుప్రీం కోర్టు ధర్మాసనం... ఈ అంశంపై తదుపరి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చి వైద్య విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. రష్యా-ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో తాము వైద్య విద్యను కొనసాగించలేకపోయామని అందులో వెల్లడించారు. స్టడీస్ కంటిన్యూ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Live: Addressing the public gathering in Siddipet https://t.co/vax1MaRfj0
— Harish Rao Thanneeru (@trsharish) September 16, 2022