అన్వేషించండి

Raja Singh: కిషన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటే మళ్లీ పిలుస్తారా ? - రాజాసింగ్‌కు రాజకీయం అర్థం కాలేదా ?

Telangana BJP: బీజేపీ హైకమాండ్ పిలిస్తే మళ్లీ బీజేపీలో చేరుతానని రాజాసింగ్ అంటున్నారు. కానీ ఆయన కిషన్ రెడ్డిని గట్టిగా విమర్శిస్తూనే ఉన్నారు.

Raja Singh will rejoin BJP: బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. తాను రాజీనామా చేసినందుకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఫోన్ చేసి తిట్టారని ఆయన చెబుతున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ హైకమాండ్ నుంచి కొంత మంది తనతో టచ్ లో ఉన్నారని వారు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు బీజేపీలో చేరుతానని ప్రకటించారు.               

అయితే ఇప్పుడు కూడా ఆయన కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలుచేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిందున.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కొంత మంది బీజేపీ నేతలు ఆయనను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాజాసింగ్ స్పందించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని, కిషన్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేసి, ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేసి ఎవరి బలం ఏమిటో నిరూపించుకుందామని సవాల్ విసిరారు.  "తెలంగాణలో బీజేపీ నాశనం అయింది కిషన్ రెడ్డి వల్లే. ఆయనే వెనుక ఉండి  తనపై తప్పుడు చేయిస్తున్నారు" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.                

ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రబ్బర్ స్టాంప్ లా పని చేస్తు న్నారని ఆరోపించారు. తాజాగా ఆయన ప్రకటించిన రాష్ట్ర కమిటీపై రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ఆ కమిటీ వేసింది ..రామచంద్రరావా..కిషన్ రెడ్డా అని ప్రశ్నించారు. ఈ కమిటీతో తెలంగాణలో బ ీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నారు.  "బీజేపీకి ఎవరు అధ్యక్షుడు అయితే తెలంగాణలో అధికారంలోకి వస్తుందో త్వరలో మరో ప్రెస్ మీట్‌లో చెప్తాను" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.           

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన ఆయనకు ఆ చాన్స్ దక్కకపోవడం, తనకు నామినేషన్ వేసే చాన్స్ కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ.. పార్టీకి రాజీనామా చేశారు. పదే పదే ఆయన పార్టీని ధిక్కరించి పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నందున.. ఆయన రాజీనామాను పార్టీ హైకమాండ్ కూడా వెంటనే అంగీకరించింది. దాంతో ఆయన మాజీ బీజేపీ నేత అయ్యారు. అయితే ఆయన వేరే పార్టీల్లో చేరట్లేదు. తనకు బీజేపీ తప్ప మరో పార్టీ సరిపడదని అంటున్నారు.          

ఆయన ఇప్పటికీ రాష్ట్ర నేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.  పార్టీతో సంబందం లేకుండానే ఇలా చేస్తున్న ఆయనకు.. పార్టీలోకి రానిస్తే మరింత రచ్చ చేస్తారని.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎవరూ సిద్ధపడే అవకాశం లేదు. సైలెంట్ గా ఉండి.. మళ్లీ బీజేపీలో చేరాల్సిన ఆయన.. పదే పదే రాష్ట్ర నేతలపై విమర్శలు చేస్తూ.. బీజేపీలోకి తనకు ఎంట్రీ లేకుండా చేసుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

22A Land Declaration: 222A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
22A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Enquiry On Erravalli Farmhouse: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
CM Revanth Reddy: ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్
ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget