Medaram Jatara 2022: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మేడారం జాతరకు వారికి అనుమతి లేదు..! యోచిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం
ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకువస్తే మేడారానికి అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆసియా ఖండంలోని అతిపెద్దదైన మేడారం జాతర (Medaram Jatara) సమీపిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టెన్షన్ మొదలవుతుంది. రోజురోజుకు విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి జాతర కారణంగా మరింత విజృంభించే ప్రమాదముందని భావిస్తున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏం చేయాలా అని టీఆర్ఎస్ సర్కార్ ఆలోచిస్తోంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు తరలి రానున్నారు. ఈ క్రమంలో కొవిడ్ కంట్రోల్‌కు పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు సమ్మక్క సారక్క జాతరనునిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఈ జాతర జరుగుతుంది.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండానే కొవిడ్19 నిబంధనలతో జాతర జరిగేలా ఏర్పాటు చేయనున్నారు. కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఆంక్షలు విధించాలనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మరోవైపు తెలంగాణ తర్వాత మేడారం జాతరకు అత్యధిక సంఖ్యలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే భక్తులపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు బోర్డర్లలో టెస్టులు చేయాలనుకుంటోంది. కానీ వచ్చినోళ్లందరికీ టెస్టులు చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనే సందిగ్థంలో ఉన్నారు. ఎక్కువ జనాలు ఒకేసారి వస్తే హెల్త్ క్యాంపులు ఎలా పెట్టాలని మదనపడుతున్నారు. దీంతో సీనియర్ అధికారులు, డాక్టర్లు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటోంది.
గత ఏడాది సంక్రాంతి తర్వాత, వేసవి మొదలైన సమయంలో భారీగా చేరిన పరిస్థితులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ములుగు జిల్లాలో స్పెషల్ టీం పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులు, వివరాలను సేకరించింది. ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే ఆదివాసీలకు ఏ మేరకు వాక్సినేషన్ పూర్తయిందనే సమాచారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించే పనిలో ఉన్నట్టుగా సమాచారం. వాక్సినేషన్ వివరాల ప్రకారం జాతరకు భక్తులను అనుమతించనున్నారు. జాతర కు వచ్చే వారు తప్పనిసరిగా వాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే రాష్ర్టంలో అనుమతించనున్నారు. ఈ మేరకు సరిహద్దుల్లోనే తనిఖీలు చేపట్టనున్నారు.
Also Read: Private Part Cut: పెద్దల్ని ఎదిరించిన లవర్స్, అతని ప్రైవేట్ పార్ట్స్ కోసేసి.. అడవిలో పడేసి ఘోరం!
Also Read: Sangareddy: పగలంతా ఫుడ్ డెలివరీ బాయ్స్.. రాత్రికి పాడు పనులు, కిటికీల వద్దకు వెళ్లి..