Warangal News: వరంగల్ జిల్లాలో విషాదం- విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
Warangal News: దుర్గమ్మ పండగ కోసం చేస్తున్న విద్యుత్ అలంకరణ నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. విద్యుత్ షాక్‌తో నలుగురు వ్యక్తులు మృతి చెందగా... మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
Warangal News:వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురైన నలుగురు వ్యక్తులు చనిపోయారు. భూఖ్య దేవేందర్ అనే వ్యక్తి స్పాట్‌లోనే చనిపోగా... మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
విద్యుత్ షాక్ తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ వారు ప్రాణాలు వదిలేశారు. విద్యుత్ షాక్‌తో చనిపోయిన వారు గట్టికల్లు జగన్నాథ, పెళ్లి దేవేందర్, తొర్రూరు మండలం జమస్తన్ పురం తండాకు చెందిన అనిల్ గా గుర్తించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన భూక్య చిన్ను అనే నాలుగేళ్ల బాలుడు వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతున్నారు. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. దుర్గమ్మ పండుగ కోసం డెకరేషన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.