News
News
X

International Womens Day: కాకతీయుల గడ్డపై రాణి రుద్రమలను ఘనంగా సన్మానించుకుందాం: మంత్రి సత్యవతి రాథోడ్

International Womens Day 2023: అత్యంత ప్రాముఖ్యత గల పట్టణంగా వరంగల్ కి పేరు ఉందని, కాకతీయుల గడ్డ కళాకారులకు నిలయం కాబట్టి రాణి రుద్రమలకు ఘనంగా సన్మానించాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

FOLLOW US: 
Share:

Satyavathi Rathod About International Womens Day 2023:
- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుదాం
- మహిళా స్ఫూర్తి నింపే వారికి అవార్డుల ప్రదానం
- కాకతీయుల గడ్డపై రాణి రుద్రమలకు సన్మానం చేయడం సంతోషకరం
మంత్రి సత్యవతి రాథోడ్

వరంగల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని రాష్ట్ర కార్యాలయంలో కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో మహిళా అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గిరిజన, స్త్రీ, శిశు సంరక్షణ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సంవత్సరం వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో గల ఆడిటోరియంలో జరుపుకోవడం సంతోషకరంగా ఉందని, అందరూ బాధ్యతగా, ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. 
కాకతీయుల గడ్డ కళాకారులకు నిలయం
హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత గల పట్టణంగా వరంగల్ కి పేరు ఉందని, కాకతీయుల గడ్డ కళాకారులకు నిలయం కాబట్టి రాణి రుద్రమలకు ఘనంగా సన్మానించాలని అన్నారు. అనేక రంగాలలో ప్రముఖులను గుర్తించేందుకు ఒక కమిటీని నియమించాలని, ప్రతిభగల వారిని గుర్తించి, వెలికి తీసి, మహిళల్లో స్ఫూర్తి నింపే వారిని ఎంపిక చేసి, అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒక లక్ష రూపాయల పారితోషకం, సన్మాన పత్రం షీల్డ్ శాలువాతో సన్మానించడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు అవార్డు తీసుకొని ఉన్నారని, ఇప్పుడు కూడా జిల్లాకు సంబంధించిన ముఖ్యులను సన్మానించాల్సిన బాధ్యత మనకు ఉందన్నారు. 

ప్రోటోకాల్ పాటించాలని, ఎవరూ కూడా మిస్ కాకుండా సర్పంచి నుండి మొదలుకొని  మంత్రి వరకు అందరిని సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కమిషన్ మెంబర్లు ఎవరు కూడా మిస్ కాకుండా చూసుకోవాలన్నారు. వీరితోపాటు మహిళా జర్నలిస్టులు డాక్టర్లు వివిధ శాఖల్లో పని చేసిన అధికారులకు గుర్తింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రం నల్గొండ నుండి వస్తారు కాబట్టి వచ్చినటువంటి అతిధులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని  జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. 
బొకేస్ కాకుండా మొక్కలు ఇవ్వండి
సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబిం మించే విధంగా కాకతీయ తోరణం గల షిల్డ్ లు, పోచంపల్లి శాలువాలను వినియోగించాలని ఆమె అభిప్రాయపడ్డారు. బొకేస్ కాకుండా మొక్కలను ఇవ్వాలని అన్నారు. సమావేశంలో  స్పెషల్ సెక్రటరీ భారతి హోలీ కేర్  పాల్గొని డయాస్ అరేంజ్మెంట్స్, రూట్ మ్యాపులు, భారీ కేడ్స్, సీటింగ్ అరేంజ్మెంట్, మొబిలైజేషన్, వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా విభిన్న  శాఖలలో పనిచేసేటువంటి మహిళ ఉద్యోగులకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మేయర్ గుండు సుధారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోలీ కేరి, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికా రెడ్డి, హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్, వరంగల్ కలెక్టర్ గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, జేడీ లక్ష్మీ, మహిళ శిశు సంక్షేమ శాఖ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Published at : 04 Mar 2023 09:49 PM (IST) Tags: Satyavathi Rathod Rudramadevi international womens day Telangana Womens Day 2023

సంబంధిత కథనాలు

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?