అన్వేషించండి

CM Revanth Reddy: కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి వివాదాలే ఉండేవి కావు- సీఎం రేవంత్ రెడ్డి

BRS vs Congress | బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈరోజు వివాదాలే ఉండేవి కావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కన్నాయిగూడెం: గోదావరి జలాల అంశం రాజకీయ రంగు పులుముకుందని, గత పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నేడు ఇలాంటి వివాదాలే ఉండేవి కావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పర్యటనలో భాగంగా గోదావరి జలాల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.  తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిని తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టులు నిర్మించుకుని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అబద్ధపు ప్రచారాలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. సమైఖ్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణ వద్ద నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నాయి.

చిత్తశుద్ధితో ప్రాణహిత చేవెళ్ల, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్టు, ఎస్సారెస్సీ స్టేజ్ 3 పూర్తి చేసింటే  రాష్ట్రంలో 960 టీఎంసీల వినియోగం అందుబాటులోకి వచ్చేది. కృష్ణా పరివాహక ప్రాంతానికి సైతం గోదావరి జలాలను తరలించే అవకాశం ఉండేది. ఇకనైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిధుల కొరత వచ్చింది. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల బారం తెలంగాణపై ఉంది. 70 శాతం ప్రాజెక్టులు పూర్తయినా, 30 శాతం పూర్తి చేయడానికి నిధులు లేవని’ అన్నారు.


CM Revanth Reddy: కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి వివాదాలే ఉండేవి కావు- సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి జలాల ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తాం..
‘దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2001లో 6 వేల కోట్ల అంచనాతో మొదలై 13 వేల కోట్ల సవరించిన అంచనాల నుంచి 14,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ 18,500 కోట్లు ఖర్చు చేస్తే తప్పా పనులు పూర్తయ్యే అవకాశం లేదు. పనులు వేగవంతం చేసి ప్రాజెక్టు పూర్తి చేయాలి. మహారాష్ట్ర సరిహద్దు నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులపై సమీక్ష చేసి, వాటిని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. గత పదేళ్లలో మీరు ఏం ప్రాజెక్టులు పూర్తి చేశారో అప్పటిమంత్రి హరీష్ రావు చెప్పాలి. ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులపై రెండేళ్లలో ఏం పనులు చేశారో చర్చించడానికి అసెంబ్లీకి రావాలి. మీరు చేసే సూచనలు పనికొస్తే తప్పక వాటిని పాటించి తీరుతామని’ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

రెండేళ్లుగా కాళేశ్వరం నుంచి చుక్కనీరు ఎత్తిపోయలేదు..

గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మిగిలిన ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనివల్ల ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి, భూసేకరణకు తీవ్ర నిధుల కొరత ఏర్పడిందని అన్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా పంటలకు అందలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత అక్కడి నుండి నీటిని ఎత్తిపోయలేదని, కాళేశ్వరం నిరుపయోగంగా మారినా రాష్ట్రంలో అధిక వరి దిగుబడి రావడం రైతుల గొప్పతనమని పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు చేసిన తప్పులను గ్రహించే ప్రజలు వారికి తగిన తీర్పు ఇచ్చారని, గత పదేళ్లలో ఏం జరిగిందో, ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏం చేస్తోందో అసెంబ్లీలో చర్చిద్దాం అన్నారు. ప్రతిపక్షం తమ అనుభవంతో ఇచ్చే మంచి సూచనలను స్వీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ప్రజలదే తప్పు అనేలా బీఆర్ఎస్ వ్యవహారం..

గోదావరి, కృష్ణా జలాల విషయంలో తాము ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తున్నామనే ఆరోపణలు అసంబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, రాజకీయ రంగు పులమడం సరికాదని హితవు పలికారు. ప్రజల తీర్పు తర్వాత కూడా బీఆర్‌ఎస్ నేతలు మారలేదని, తిరిగి గెలవకపోవడానికి ప్రజలదే తప్పు అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారని అన్నారు.  సీఎం కుర్చీ ఎవరికీ వారసత్వంగా దక్కదని, ప్రజలు ప్రతి పార్టీకి వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరో అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను వృథాగా వదిలేయకుండా నిపుణుల సూచనల మేరకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget