Apollo Dialysis Clinic: వరంగల్ ప్రజలకు అందుబాటులోకి అపోలో డయాలిసిస్ క్లినిక్
Apollo Dialysis Clinic:వరంల్ ప్రజలకు కొత్త డయాలిసిస్ కేంద్రాన్ని అపోలో డయాలిసిస్ క్లినిక్ ప్రారంభించింది. ఓ ప్రైవేటు ఆసుపత్రితో కలిసి దీన్ని స్టార్ట్ చేసింది.

Apollo Dialysis Clinic: అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్స్ తన కొత్త డయాలిసిస్ కేంద్రాన్ని వరంగల్‌లో ప్రారంభించింది. అపోలో రీచ్ NSR హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు అత్యుత్తమ డయాలిసిస్ సేవలు అందబోతున్నాయి. అధునాతన సాంకేతికతతో నిర్మించిన ఈ సెంటర్‌లో అనుభవజ్ఞులైన నెఫ్రోలజిస్ట్‌లు, ప్రత్యేక శిక్షణ పొందిన డయాలిసిస్ సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారు.
ఆరోగ్యశ్రీ, ఇతర ప్రధాన వైద్య బీమా పథకాల ద్వారా రోగులు ఇక్కడ డయాలిసిస్ సేవలు పొందవచ్చు. ఇది రోగుల కోసం ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తుంది. ప్రపంచస్థాయి వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే సీనియర్ నెఫ్రోలజిస్ట్ డా. నిర్మల్ పాపయ్య అన్నారు. డయాలిసిస్ చికిత్సలో వేగం ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. మూత్రపిండ సంబంధిత వ్యాధులను సమయానికి గుర్తించి చికిత్స చేయడం ద్వారా రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని తెలిపారు. ఈ డయాలిసిస్ సెంటర్ ఆధునిక పద్ధతులతో కూడిన చికిత్సలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
అపోలోడయాలసిస్ క్లినిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్రావు మాట్లాడుతూ... ఈ అధునాతనమైన డయాలిసిస్ క్లినిక్ ద్వారా అనేక మందికి మెరుగైన డయాలిసిస్ సేవలు అందుతాయన్నారు. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ బీమా పథకాల సహకారంతో సేవలు అందిస్తామన్నారు. ప్రతి డయాలిసిస్ రోగి తగిన చికిత్స పొందేలా చేయడమే మా లక్ష్యమని పేర్కొన్నారు.

భవిష్యత్తులో అపోలో డయాలసిస్ క్లినిక్‌లు నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలకు మండలాల స్థాయికి కూడా తీసుకెళ్తామన్నారు అపోలో యాజమాన్యం. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన వైద్యసిబ్బంది సహకారంతో ప్రపంచస్థాయి డయాలిసిస్ సేవలను ప్రతి రోగికి అందేలా కిడ్నీ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమ హాస్పిటల్‌లో అపోలో డయాలిసిస్ క్లినిక్‌ను ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయమన్నారు NSR గ్రూప్ ఛైర్మన్ శ్రీ N. సంపత్ రావు. అధునాతన కిడ్నీ చికిత్సను అందించడంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని రోగులకు మరిన్ని సేవలను అందించడానికి కృషి చేస్తామని తెలిపారు.
అపోలో డయాలిసిస్ కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అసోం, బిహార్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో 140+ కేంద్రాల్లో సేవలు అందిస్తోంది. హీమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిస్, చిల్ట్రన్ డయాలిసిస్, మూత్రపిండ మార్పిడి సేవలు అందిస్తారు. పల్లెటూర్లు, పట్టణ ప్రాంతాల్లో సేవలు అందించదుకు ప్రయత్ననిస్తున్నారు. అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్ (AHLL) అనేది అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ (AHEL) అనుబంధ సంస్థ. 2002 నుంచి భారతదేశంలో 5500+ వైద్యులతో 20 మిలియన్+ మంది రోగులకు సేవలు అందిస్తోంది. వెంటనే ఆసుపత్రి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఇంటికి దగ్గరగా అత్యుత్తమ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.





















