Warangal Crime News: వరంగల్‌లో పేకాడుతూ చిక్కిన రాజకీయ ప్రముఖులు- మాజీ ఎమ్మెల్యే సహా 13 మంది అరెస్టు
Warangal Crime News: వరంగల్‌లో పేకాడుతూ రాజకీయ ప్రముఖులు చిక్కారు. వారిలో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Warangal Crime News: వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజకీయ ప్రముఖులు పేకాడుతూ పట్టుబడ్డారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లోనే దందా మొదలెట్టిన ఘటన ఆందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో ఈ ఘటన జరిగింది. అక్కడకు చేరిన పోలీసులు ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో పేకాడుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. అక్కడ 13 మంది పేకాడుతున్నట్టు గుర్తించారు. వారిలో మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు, గూడూరు హరిబాబు, సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, నోముల తిరుపతిరెడ్డి, రావర్ల శ్రీనివాసరావు, సయ్యద్ జావీద్, నీలం రాజ్‌కిశోర్ ఉన్నారు. వారందర్ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు.




















