By: ABP Desam | Updated at : 28 Jan 2023 05:51 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వరంగల్ హెల్త్ సిటీ పనులు పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao : వరంగల్ లో హెల్త్ సిటీ నిర్మాణ పనులను వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు శనివారం పరిశీలించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ సిటీ నిర్మాణం పరిశీలించామన్నారు. వరంగల్ తో పాటు, ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ 2000 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టామన్నారు. హెల్త్ సిటీ నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయన్నారు. 2023 చివరి నాటికి భవనం పూర్తి అవుతుందన్నారు. దసరా నాటికే పూర్తి అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి, ఏజెన్సీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. మొత్తం 16.5 లక్షల ఎస్ఎఫ్టీలో 24 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు తెలియజేశారు.
216 ఎకరాల్లో హెల్త్ సిటీ
"వరంగల్ హెల్త్ సిటీ చారిత్రాత్మక భవనం. రాష్ట్రానికే కాదు దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాం. 216 ఎకరాల్లో ఈహెల్త్ సిటీ రూపుదిద్దుకుంటోంది. అవయవమార్పిడి ఆపరేషన్లు కూడా వరంగల్ లో అందుబాటులోకి రాబోతాయి. హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అంతగా అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు. రాజకీయాల కోసం కొందరు విమర్శలు చేస్తారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా విమర్శలు చేశారు. విమర్శలు చేసినోళ్లే ఇవాళ నోరెళ్లబెడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖనాకు అనే వారు. ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖనాకు అంటుతున్నారు. ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉంది. మెడికల్ చదువు కోసం మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కృషి చేస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో మెడికల్ విద్యలో వెనకబడ్డాం" - మంత్రి హరీశ్ రావు
వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్
తెలంగాణలో మంచి పథకాలు అమలు చేస్తున్నారని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు చెబుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. దిల్లీలో, పంజాబ్ లో కంటి వెలుగు ప్రారంభిస్తామని ప్రకటించారన్నారు. కంటి వెలుగుకు భారీ స్పందన వస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్దకు ప్రజలు కాదు, ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి పరీక్షలు చేస్తుందన్నారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. కాళేశ్వరం స్ఫూర్తితో వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా ఇలాగే అన్నారని, నీళ్లు వచ్చి వరంగల్ లో రెండు పంటలు పండుతున్నాయని తెలిపారు. యాసంగిలో రెండు పంటలు పండుతున్నాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్నారు. వరంగల్ నగరానికే కాదు జాతీయ స్థాయిలో అద్భుతమైన అవసరాలు తీర్చే ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రి దేశానికే ఒక మోడల్ కానున్నదని మంత్రి తెలిపారు. దీంతో పేద ప్రజలకు కార్పొరేట్ వసతులు కలుగుతాయన్నారు. వరంగల్ లో హెల్త్ యూనివర్సటీ, వెటర్నిటీ యునివర్సటీ ఏర్పాటు చేశామని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ
"రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. 926 మంది డాక్టర్లు నియామకం చేశాం. 12,13 వందల ప్రొఫెసర్ పోస్టుల రిక్రూట్ చేస్తున్నాం. కేంద్రం సహకారం ఇవ్వడం లేదు. వివక్ష పూరిత వైఖరితో 157 కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. రాష్ట్ర సొంత నిధులతో సీఎం 8 మెడికల్ కాలేజీలు కట్టారు. జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సీఎం స్వయంగా హెల్త్ సిటీ పనులు సమీక్ష చేస్తున్నారు. ఎలాంటి నిధుల కొరత లేదు." - మంత్రి హరీశ్ రావు
Kavitha : ప్రగతి భవన్కు చేరుకున్న కవిత - 24న సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ !
RRB Group D Result: రైల్వే 'గ్రూప్-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?
Ugadi 2023: ఉగాది అంటే అందరికీ పచ్చడి, పంచాంగం: వాళ్లకు మాత్రం అలా కాదు!
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!
Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!