అన్వేషించండి

Telangana Panchayat Elections: మరోసారి ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ - పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ ఎస్‌ఈసీ సన్నాహాలు

Voter list : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం మరోసారి ఓటర్ల జాబితాను సవరిస్తున్నారు. ఇందు కోసం తెలంగాణ ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.

Telangana Voter list revised :  తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సన్నాహాలు ప్రారంభించింది.  రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) గ్రామీణ ప్రాంతాల్లో  ఓటర్ల  జాబితాల సవరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ కార్యాచరణ నవంబర్ 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు జరిగేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈలోపుల ఓటర్ల   జాబితాల్లో లోపాలను సరిచేసి, కొత్త ఓటర్లను చేర్చి ..  పారదర్శకమైన ఓటర్ల జాబితాను రెడీ  చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఈ ప్రకటనతో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్  రెండో వారంలో  నిర్వహించడానికి ప్రక్రియ ప్రారంభించినట్లయింది.          

కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఓటర్ల జాబితా సవరణ            

TSEC ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ నవంబర్ 20న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలు,  తప్పులు సరిదిద్దడం వంటివి చేస్తారు.  ఇరవయ్యో తేదీన ఓటర్లు తమ గ్రామ పంచాయతీ కార్యాలయాలు, బూత్‌ లెవల్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు 18 ఏళ్లు పూర్తి చేసినవారు, పేరు తప్పులు, అడ్రస్ మార్పులు, మరణించినవారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై దరఖాస్తులు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా   అభ్యంతరాలు పరిష్కరణ ఇరవై రెండోతేదీన ఉంటుంది. ఈ రోజు బూత్‌లెవల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అర్హత తనిఖీలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ దశలో జరుగుతాయి.          

నవంబర్ 23న తుది ఓటర్ల జాబితా సవరణ         

నవంబర్ 23న చివరి ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ స్టేషన్లు ధృవీకరణ ఉంటుంది.  సవరించిన ఓటర్ల జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.  ఈ ప్రక్రియలో ఓటర్లు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. ఆన్‌లైన్‌లో కూడా (tsvs.eci.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చు. TSEC అధికారులు, "ఈ సవరణ ద్వారా 18-19 ఏళ్ల యువతను, మహిళలను మావట జాబితాల్లో చేర్చి, ఎన్నికల పారదర్శకతను పెంచుతాము" అని తెలిపారు. ఈ కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో జరుగుతుంది.              

మూడు దశల్లో 12వేలకుపైగా పంచాయతీల్లో నెలలో పూర్తి                           
 
సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది.  ప్రతి దశ మధ్య గరిష్టంగా ఐదు రోజుల వ్యవధి ఉంటుంది. ఈ మేరకు, డిసెంబర్  రెండో వారం నుంచి నెలలో  మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.   ఎన్నికలు పార్టీ సింబుల్స్ లేకుండా (నాన్-పాలిటికల్) జరుగుతాయి, కానీ పార్టీలు తమ మద్దతును అభ్యర్థులకు అందించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే  42 శాతం బీసీ కోటాను అమలు చేస్తామని ప్రకటించింది.
   

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget