అన్వేషించండి

Distribution of Indiramma sarees: మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం - ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన రేవంత్

Indiramma sarees: ఇందిరమ్మ చీరల పంపిణీ ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళా సాధికారితకు ప్రయత్నిస్తామన్నారు.

Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా 'ఇందిరమ్మ చీరల పంపిణీ' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కోటి మంది   మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆమె సేవలను స్మరించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు లబ్ధిదారులకు చీరలు అందజేసి పంపిణీ ప్రారంభించారు. ఈ చీరలు సిరిసిల్ల  నేత కళాకారులు తయారు చేస్తున్నారు.                         

ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు.  ఇందిరమ్మ చీరలు మహిళల స్వయం ప్రతిపత్తికి చిహ్నం. మేము మహిళలను కోటీపతులను తీర్చిదిద్దాలని, వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నాం  అని పేర్కొన్నారు.   ఇందిరమ్మ డా.బి.ఆర్. అంబేడ్కర్ కలలను నెరవేర్చారు. బ్యాంకుల జాతీయీకరణ, భూమి సీలింగ్ చట్టం, పేదలకు భూముల పంపిణీ, ఇళ్ల నిర్మాణం మొదలైనవి ఆమె సేవలు. మేము ఆ ఆదర్శాలతో మహిళల సాధికారతకు కృషి చేస్తున్నామని రేవంత్ తెలిపారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు 'ఇందిరమ్మ చీరలు' ధరించాలి. వారు మహిళల స్వయం ప్రతిపత్తి, గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి" అని పిలుపునిచ్చారు.                

 "మేము మహిళలను కోటీశ్వరులుగా  తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్నాం. పెట్రోల్ బంకులు, TGSRTCకు 1,000 బస్సులు మహిళా స్వయం సహాయక బృందాలకు కేటాయించాం. ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుతోనే, రాజకీయంలో మహిళలకు ప్రాధాన్యత" అని ప్రకటించారు.  "చీరల తయారీకి సమయం తీసుకుంటుంది కాబట్టి, రెండు దశల్లో పంపిణీ చేస్తున్నామన్నారు.  నాణ్యతపై రాజీ లేదు. టెక్నాలజీతో పారదర్శకత, నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.                   

 రేషన్ కార్డ్  ఉన్న  BPL కుటుంబాల్లోని మహిళలు, వితంతు మహిళలు, వృద్ధాప్య మహిళలు అందరికీ పంపిణీ చేస్తున్నారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకత కల్పించడానికి టెక్నాలజీ ఉపయోగిస్తూ, నాణ్యతపై ఎటువంటి రాజీ కాకుండా పర్యవేక్షణ చేస్తారు. మొత్తం బడ్జెట్ రూ.1,000 కోట్లు గా కేటాయించారు.   

తర్వాత చీరల లబ్దిదారులతో సీఎం రేవంత్ మాట్లాడారు. త మ‌కు ఇస్తున్న చీర‌ల డిజైన్లు ఎంతో బాగున్నాయ‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురాలు భాగ్య ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 9 మీట‌ర్లు, 6 మీట‌ర్ల చీర‌లు త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఉన్నాయ‌ని.... త‌మ‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని ఆమె సీఎంకు తెలియ‌జేశారు. ఇందిరామ‌హిళా శ‌క్తి చీర‌లు ఇవ్వ‌డం ద్వారా త‌మ‌కు యూనిఫాం వ‌చ్చింద‌నే సంతోషం ఉంద‌ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురాలు శ్రీ‌దేవి తెలిపారు. ఈ చీర‌లు ధ‌రించ‌డం ద్వారా త‌మ సంఘాల మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంద‌ని ఆమె  అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Offer: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
Netflix in Hyderabad: హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Speaker Decision: అనర్హత, రాజీనామాల విషయంలో స్పీకర్‌కు గడువు - బీఆర్ఎస్ పిటిషన్లతో క్లారిటీ - ఇక పెండింగ్ పెట్టలేరా ?
అనర్హత, రాజీనామాల విషయంలో స్పీకర్‌కు గడువు - బీఆర్ఎస్ పిటిషన్లతో క్లారిటీ - ఇక పెండింగ్ పెట్టలేరా ?
Nirmal District Latest News: శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!
శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lok Sabha Rahul Gandhi: భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
GHMC Offer: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
Ustaad Bhagat Sing Songs : ఉస్తాద్ భగత్ సింగ్ కాలరే ఎత్తరా సాంగ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా మాస్ బీట్
ఉస్తాద్ భగత్ సింగ్ కాలరే ఎత్తరా సాంగ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా మాస్ బీట్
Rajasekhar Gotila Factory : అది చూసి ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం - 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' ప్రచారంపై జీవిత రియాక్షన్
అది చూసి ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం - 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' ప్రచారంపై జీవిత రియాక్షన్
Mahindra Thar EMI Plan: మహీంద్రా థార్ కొనడానికి అవసరమైన జీతం ఎంత? EMI, డౌన్ పేమెంట్ వివరాలేంటీ?
మహీంద్రా థార్ కొనడానికి అవసరమైన జీతం ఎంత? EMI, డౌన్ పేమెంట్ వివరాలేంటీ?
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
When will the war stop: పశ్చిమాసియా యుద్ధం ఆపాలన్నా ఆగదు - అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈగో వార్ కూడా స్టార్ట్ !
పశ్చిమాసియా యుద్ధం ఆపాలన్నా ఆగదు - అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈగో వార్ కూడా స్టార్ట్ !
Netflix in Hyderabad: హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget