అన్వేషించండి

US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  

US Iran News: టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలపై చర్చను మళ్లీ రేకెత్తించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నాటో శిఖరాగ్రంలో ట్రంప్ ఇరాన్‌తో అవగాహన ఒప్పందం ముగిసిందని ప్రకటించారు.
  • హోర్ముజ్ దాడికి ప్రతిగా అమెరికా ఇరాన్‌పై శక్తివంతమైన దాడులు చేసింది.
  • ట్రంప్ ఇరాన్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించగా ఉద్రిక్తతలు పెరిగాయి.

US Iran News: టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్‌తో ఉన్న అవగాహన ఒప్పందం (MoU) గడువు ఇప్పుడు ముగిసిపోయిందని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలి పరిణామాల తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం తన ప్రాధాన్యత కోల్పోయిందని ఆయన తెలిపారు. 

అవగాహన ఒప్పందం ముగిసిపోయింది

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, "ఇప్పుడు అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను" అని ట్రంప్ అన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య పరిస్థితి ఎంతగా ముదిరిందంటే, ఇరు దేశాల మధ్య ఒప్పందం భవిష్యత్తు ముగిసిపోయిందని భావించాలని ఆయన సూచించారు. "నిన్న రాత్రి ఇరాన్‌లోని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులపై శక్తివంతమైన దాడి చేశాము" అని ట్రంప్ అన్నారు. ఈ చర్య అమెరికా భద్రతకు అత్యవసరమని ఆయన అభివర్ణించారు  ఈ ఆపరేషన్‌ను చాలా స్ట్రాంగ్‌గా నిర్వహించామని చెప్పారు.

ఇరాన్ నాయకత్వంపై కామెంట్స్ 

అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, "వారికి జబ్బుంది, వారిలో ఏదో లోపం ఉంది" అని అన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, ఇరు దేశాల మధ్య ఇటీవలి సైనిక పరిణామాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారిన టైంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఘర్షణకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పరోక్ష చర్చలకు అవకాశం కల్పించేందుకు లక్ష్యంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఖతార్‌లో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇంతలో అమెరికా మంగళవారం ఇరాన్ లక్ష్యాలంగా దాడులు మొదలు పెట్టింది. దీనికి తోడు ట్రంప్ కూడా తీవ్రంగా స్పందించారు. "వారు అబద్ధాలకోరులు, మోసగాళ్ళు, రోగులు," అని విరుచుకుపడ్డారు. ఇరాన్ అధికారులతో తదుపరి చర్చలు జరపడానికి తనకు ఆసక్తి లేదని పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి.

వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధిలో జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయని అమెరికా పేర్కొంది.

హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా సైనిక దాడులు జరిపినట్లు సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది. ఈ దాడుల అనంతరం మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సెంట్‌కామ్ ప్రకారం, "వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడికి తక్షణ ప్రతిస్పందన"గా ఈ ఆపరేషన్ జరిగింది.

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన జలమార్గంలో ఇప్పటికే బలహీనంగా ఉన్న భద్రతా పరిస్థితి మరింత క్షీణించిందనడానికి ఈ సైనిక చర్య ఉదాహరణగా నిలుస్తుంది. 

నిరసనకారులపై అణచివేత జరుగుతోందని ట్రంప్ ఆరోపణ

తన ప్రసంగంలో ఇరాన్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అధికారులు తీవ్రమైన అణచివేతకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 

వాషింగ్టన్‌పై టెహ్రాన్ తీవ్ర ఆరోపణలు

అమెరికా పదే పదే చేస్తున్న దాడులను ఇరాన్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇవి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఈ ప్రాంతంలో వాషింగ్టన్ మరింత అస్థిరతను సృష్టిస్తోందని ఆరోపించారు.

ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా పదేపదే ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పదేపదే జరుగుతున్న ఈ దురాక్రమణ చర్యలకు టెహ్రాన్ ప్రతిస్పందిస్తుందని హెచ్చరించింది. 

Frequently Asked Questions

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉన్న అవగాహన ఒప్పందం (MoU) గురించి ఏమని వ్యాఖ్యానించారు?

ట్రంప్ ప్రకారం, ఇరాన్‌తో ఉన్న అవగాహన ఒప్పందం గడువు ముగిసింది. ఇటీవలి పరిణామాల తర్వాత ఈ ఒప్పందం తన ప్రాధాన్యతను కోల్పోయిందని ఆయన నమ్ముతున్నారు.

అమెరికా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేయడానికి గల కారణం ఏమిటి?

హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఈ సైనిక దాడులు జరిపింది. ఇది

అమెరికా దాడులపై ఇరాన్ ఎలా స్పందించింది?

అమెరికా దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్ ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టిస్తోందని ఆరోపించింది.

అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన మధ్యంతర ఒప్పందం ఏమిటి?

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఘర్షణకు శాశ్వత పరిష్కారం కోసం పరోక్ష చర్చలకు ఇది అవకాశం కల్పించాలనే లక్ష్యంతో జరిగింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget