Rahul Sipligunj Wedding: తెలంగాణ ముఖ్యమంత్రిని పెళ్లికి ఆహ్వానించిన రాహుల్ సిప్లిగంజ్... వెడ్డింగ్ ఎప్పుడంటే?
CM Revanth Reddy: ఈ నెలలో యువ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి. తన వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

ప్రతిభ ఉన్నవాళ్ళకు చిత్రసీమ పట్టం కడుతుందని చెప్పడానికి యువ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఒక ఉదాహరణ. ఆయన శాస్త్రీయ సంగీతం నేర్చుకుని వచ్చిన సింగర్ కాదు. ప్రతిభతో పైకి వచ్చినవాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడం నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి సినిమాల్లోకి వచ్చాడు. ఆస్కార్ స్టేజి వరకు వెళ్లారు. ఇప్పుడీ యువ గాయకుడు పెళ్లికి సిద్ధమయ్యాడు.
రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన రాహుల్
ఆస్కార్ స్టేజి మీద 'నాటు నాటు...'ను రాహుల్ సిప్లిగంజ్ పాడిన సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన అతను, జీవితంలోనూ సెటిల్ అవుతున్నాడు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
Also Read: మహేష్ బాబు - రాజమౌళిల వారణాసి బడ్జెట్ ఎంత? ఇండస్ట్రీలో వచ్చిన పుకార్లు నమ్మొచ్చా? అసలు నిజం ఏమిటంటే?
ఆగస్టులో తాను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ నెల (నవంబర్) 27న వీరి వివాహం ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ - రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిసింది. తన పెళ్లికి రావాల్సిందిగా కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశాడు రాహుల్ సిప్లిగంజ్. హైదరాబాద్ సిటీలో జరిగే ఈ వివాహానికి తాను తప్పకుండా వస్తానని సీఎం మాట ఇచ్చారట.
Also Read: నేనేం తప్పు చేశా... తమిళ రాజకీయాలను కుదిపేసిన పార్టీ కేసు, ట్రోల్స్‌పై హీరోయిన్ ఆవేదన





















