Varanasi Movie Budget: వారణాసి బడ్జెట్ ఎంత? ఇండస్ట్రీలో వచ్చిన పుకార్లు నమ్మొచ్చా? అసలు నిజం ఏమిటంటే?
SS Rajamouli remuneration for Varanasi: 'వారణాసి' టైటిల్ రివీల్ వీడియో రిలీజ్ అయ్యాక సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బడ్జెట్ డిస్కషన్ సైతం మొదలు అయ్యింది. మరి అసలు నిజం ఏమిటి?

Varanasi movie budget remuneration details: వారణాసి... హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఆధ్యాత్మిక నగరం పేరు. ఇప్పుడీ పేరును సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ లెవల్ సినిమాకు టైటిల్‌గా ఖరారు చేశారు. దాంతో జక్కన్న ఎటువంటి సినిమా తీస్తాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక టైటిల్ రివీల్ వీడియో చూశాక బడ్జెట్ గురించి డిస్కషన్ సైతం మొదలైంది. ఈ మేరకు ఇండస్ట్రీలో కొంత చర్చ నడుస్తోంది. అందులో నిజం ఎంత? అసలు విషయం ఏమిటి? అనేది చూస్తే...
'వారణాసి' బడ్జెట్ @ 1200 - 1300 కోట్లు!?
'వారణాసి' బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అని ప్రచారం జరుగుతోంది. ఓ అడుగు ముందుకు వేసిన కొందరు... 1200 నుంచి 1300 కోట్ల రూపాయల మధ్య బడ్జెట్ ఉంటుందని, నిర్మాణ వ్యయం అంత అవ్వొచ్చని రాజమౌళి లెక్క కట్టినట్టు టాక్. అయితే... అసలు విషయం అది కాదు.
Also Read: నేనేం తప్పు చేశా... తమిళ రాజకీయాలను కుదిపేసిన పార్టీ కేసు, ట్రోల్స్‌పై హీరోయిన్ ఆవేదన
ఇప్పటి వరకు 'వారణాసి' సినిమా బడ్జెట్ లెక్కలు వేయలేదట. సుమారు 1000 కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా. అంతకు మించి కావొచ్చని, తనకు బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణకు రాజమౌళి చెప్పారట. ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయకు చెందిన షోయింగ్ బిజినెస్ కూడా నిర్మాణ భాగస్వామి కావడంతో బడ్జెట్ విషయంలో రాజీ చెందే ప్రసక్తి లేదు. క్వాలిటీ పరంగా అసలు తగ్గకూడదని భావిస్తున్నారట.
రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంత? మరి మహేష్?
రాజమౌళి ఏ సినిమా చేసినా సరే ఆయన కుటుంబం అంతా కలిసి పని చేస్తుంది. ఫ్యామిలీ ప్యాకేజ్ కింద తీసుకుంటారు. నెలకు ఇంత చొప్పున జీతం తీసుకుని, సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో 50 శాతం తీసుకోవడం రాజమౌళికి అలవాటు. ఇప్పుడీ 'వారణాసి'కి సైతం అదే లెక్క ఫాలో అవుతున్నారట. మరి హీరో మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంత? అంటే... ఏడాదికి ఇంత చొప్పున సినిమా కంప్లీట్ అయ్యే వరకు కొంత ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారట. విడుదల తర్వాత చూసుకుందామని మహేష్ బాబు చెప్పారట. అదీ సంగతి.
Also Read: వారణాసి పబ్లిసిటీ పనులు ఫినిష్... గోవా వెళ్లిన ప్రియాంక చోప్రా... పక్కన ఉన్నది ఎవరో తెలుసా?
రాజమౌళి ఫ్యామిలీ, మహేష్ బాబు మినహా మిగతా ఆర్టిస్టులు అందరికీ సినిమాకు ఒక అమౌంట్ ఫిక్స్ చేశారట. ఆ లెక్కల ప్రకారం వాళ్లకు రెమ్యూనరేషన్ ఇస్తారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ (కుంభ) చేస్తున్న ఈ సినిమాను 2027 వేసవిలో విడుదల చేయనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.





















