అన్వేషించండి

CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!

Congress: సీఎం రేవంత్ సాఫ్ట్ హిందూత్వ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయ నిర్మాణం నుంచి గోశాలల ఏర్పాటు దాకా.. బీజేపీ సెంటిమెంట్ పరంగా దెబ్బకొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Telangana Congress vs BJP Hindutva Vote Bank:  తెలంగాణ రాజకీయాల్లో సాంప్రదాయ కాంగ్రెస్ శైలికి భిన్నంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న  మైనారిటీ అనుకూల  ముద్రను పక్కనపెట్టి, తెలంగాణ సమాజంలో బలంగా ఉన్న హిందూ సెంటిమెంట్‌ను తన వైపు తిప్పుకునేందుకు ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగమే ఇటీవల రేవంత్ రెడ్డి వేగవంతం చేసిన  సాఫ్ట్ హిందూత్వ రాజకీయం. హిందూత్వ నినాదం, ఆ సెంటిమెంట్ పూర్తిగా భారతీయ జనతా పార్టీ  కి అనుకూలంగా మారకుండా, రాష్ట్రంలోని  హిందూ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఈ నయా మార్క్ పాలిటిక్స్‌ను తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

హిందువుల్ని ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలు

ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన మైలురాయి.. నూతన సచివాలయ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక నల్లపోచమ్మ ఆలయాన్ని  అత్యంత వైభవంగా నిర్మించాలని నిర్ణయించడం, దానికి సంబంధించిన పనులను స్వయంగా పర్యవేక్షించడం. గతంలో నిర్మించిన సచివాలయ ఆలయాల కంటే మిన్నగా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ గుడిని తీర్చిదిద్దుతున్నారు. కేవలం నల్లపోచమ్మ ఆలయమే కాకుండా, సచివాలయంలోని శివాలయం, ఇతర అనుబంధ గుడుల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తాము హిందూ ధర్మానికి  బీజేపీ మాత్రమే హక్కుదారు కాదనే బలమైన సంకేతాన్ని పౌర సమాజంలోకి సీఎం రేవంత్ బలంగా పంపగలిగారు.

వేల సంఖ్యలో ప్రభుత్వ గోశాలలు

హిందూ సమాజంలో అత్యంత పవిత్రంగా భావించే గోరక్షణపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో,  ప్రభుత్వ సహకారంతో వేల సంఖ్యలో అత్యాధునిక గోశాలల  ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా  అజెండా ఎమిటో తెలియచెప్పారు.  దీనికి అదనంగా.. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన దేవాదాయ భూముల పరిరక్షణపై రేవంత్ రెడ్డి ప్రత్యేక నిఘా విభాగాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రముఖ ఆలయాలకు చెందిన వేలాది ఎకరాల భూములు కబ్జా కాకుండా డిజిటల్ మ్యాపింగ్ చేయించడం, వివాదాస్పద భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. అలాగే, యాదగిరిగుట్ట  పుణ్యక్షేత్రానికి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసి, తిరుమల తరహాలో అటానమస్ బోర్డును తీసుకురావాలని భావించడం వెనుక కూడా దేవాలయాల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తామనే సందేశం దాగి ఉంది. భద్రాచలం, వేములవాడ, జోగులాంబ గద్వాల వంటి చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడం రేవంత్ వ్యూహాత్మక పంథాకు అద్దం పడుతోంది.

బీజేపీని బలపడకుండా చేసే వ్యూహం

 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుని, ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవడమే రేవంత్ రెడ్డి ఈ రూట్ మార్చడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో హిందూ ఓటర్లు కాషాయం వైపు ఆకర్షితులవుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ఓటు బ్యాంక్ మరింతగా చేజారితే రాబోయే గ్రేటర్ హైదరాబాద్  , వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అందుకే, బీజేపీ కేవలం మాటలతో హిందూత్వ రాజకీయం చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వ నిధులు, అధికారిక కార్యక్రమాల ద్వారా 'చేతల హిందూత్వాన్ని' ప్రదర్శిస్తూ కమలదళం ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.

సాఫ్ట్ హిందూత్వ ఫలితం ఇస్తుందా? 

 రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ  సాఫ్ట్ హిందూత్వ వ్యూహం కాంగ్రెస్‌కు రాజకీయంగా శ్రీరామరక్షగా మారుతుందా లేదా అనేది రాబోయే  గ్రేటర్ కార్పొరేషన్  ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. ఒకవైపు మైనారిటీ ఓటు బ్యాంకు దూరం కాకుండా చూసుకుంటూనే, మరోవైపు హిందూ సెంటిమెంట్‌ను గౌరవించడం అనేది కత్తిమీద సామే అయినప్పటికీ.. రేవంత్ రెడ్డి తన మార్క్ దూకుడుతో దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ వ్యూహం గనుక క్షేత్రస్థాయిలో పక్కాగా వర్కవుట్ అయితే, తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని భావిస్తున్న బీజేపీకి ఇది గట్టి ఎదురుదెబ్బే అవుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget