News
News
X

TSRTC Festival Special: రైట్.. రైట్.. పండగకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే..

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపనుంది.

FOLLOW US: 

సంక్రాంతి పండగ సందర్భంగా.. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ఆర్టీసీ. జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ ప్రత్యేక బస్సులు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.  పండగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు.. వసూలు చేయడంలేదని ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.

హైదరాబాద్ ఎంజీబీస్, జేబీఎస్, సీబీఎస్​, ఉప్పల్​ క్రాస్​​రోడ్, ఎల్​బీనగర్​, ఆరాంఘర్​, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్​, కేపీహెచ్​బీ, ఎస్​ఆర్​నగర్​, అమీర్​పేట, టెలిఫోన్​భవన్, దిల్​సుఖ్​నగర్​ నుంచి బస్సులు నడపనున్నారు. అంతేగాకుండా.. జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో ముఖ్యమైన స్టాపుల నుంచి బస్సులు ఉండనున్నాయి. ముందస్తు రిజర్వేషన్ కోసం..  www.tsrtconline.in వెబ్​సైట్​లోకి వెళ్లాలి. ప్రత్యేక బస్సులను సమన్వయం చేసేందుకు సిబ్బందిని కూడా నియమించినట్టు ఆర్టీసీ తెలిపింది. నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేటతోపాటు ముఖ్యమైన పట్టణాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 

సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ చెప్పింది. అయితే ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఏ విధమైన అదనపు అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.

బీహెచ్​ఈఎస్​, మియాపూర్​, కేపీహెచ్​బీ, దిల్​సుఖ్​నగర్​, ఈసీఐఎల్​, ఎల్​బీనగర్, ఆరాంఘర్​ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులు ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరితోపాటు ముఖ్యమైన పట్టణాలకు స్పెషల్ బస్సులు వెళ్లనున్నాయి.

Also Read: Corona Cases: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. తగ్గినట్టే కనిపించి ఎక్కువవుతున్న కేసులు 

Also Read: Numaish Exhibition: కరోనా ఎఫెక్ట్.. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ రద్దు

Also Read: Rock Museum: హైదరాబాద్ లో రాక్ మ్యూజియం... 55 మిలియన్ ఏళ్ల నుంచి 3.3 బిలియన్ ఏళ్ల నాటి రాళ్ల ప్రదర్శన... ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

Also Read:  'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Jan 2022 09:39 PM (IST) Tags: ANDHRA PRADESH Hyderabad tsrtc TSRTC Special Busses TSRTC Special Busses For Sankranti MGBS Sankranti Special Busses Timings TSRTC Updates

సంబంధిత కథనాలు

KCR  : బీజేపీ వల్లే సమస్యలు -  తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కేసీఆర్ పిలుపు !

KCR : బీజేపీ వల్లే సమస్యలు - తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కేసీఆర్ పిలుపు !

Munugodu BJP : మునుగోడులో టీఆర్ఎస్‌కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !

Munugodu BJP :  మునుగోడులో టీఆర్ఎస్‌కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !

RajBhavan Vs Pragati Bhavan : ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ ! కేసీఆర్ తీరుతో వివాదం మరింత ముదురుతోందా?

RajBhavan Vs Pragati Bhavan :  ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ !  కేసీఆర్ తీరుతో వివాదం మరింత ముదురుతోందా?

Himanshu Tweet : మా తాత టైగర్ - కేసీఆర్ మనవడి ట్వీట్ వైరల్ !

Himanshu Tweet :  మా తాత టైగర్ - కేసీఆర్ మనవడి ట్వీట్ వైరల్ !

BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్‌ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!

BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్‌ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!

టాప్ స్టోరీస్

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే -  ప్రభుత్వ జీవో రిలీజ్ !

Ambati Vs Janasena : బపూన్, రంభల రాంబాబు - అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?

Ambati Vs Janasena :   బపూన్, రంభల రాంబాబు -  అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?

Live Train Status: రైలు రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!

Live Train Status: రైలు రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!

Chiranjeevi Meets His Fan: క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Meets His Fan: క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి