By: ABP Desam | Updated at : 01 Jan 2023 01:18 PM (IST)
Edited By: Shankard
తెలంగాణలో మరో నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల
TSPSC Jobs 2023:
➥తెలంగాణలో మరో 4 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల
➥ ఇంటర్, సాంకేతిక విద్యలో 71 పోస్టులకు నోటిఫికేషన్
➥ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరణ
➥ కాలేజియెట్ ఎడ్యుకేషనలో 544 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
➥ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ
➥ మున్సిపల్ శాఖలో 78 పోస్టులకు నోటిఫికేషన్
➥ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ
➥ 113 అసిస్టెంట్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
TSPSC Recruitment 2023: తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగ నోటిఫికేషన్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం మరో నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశారు. తెలంగాణలో ఇదివరకే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయి. తాజాగా ఇంటర్, సాంకేతిక విద్యలో 71 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. విద్యాశాఖలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంటర్ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టులు, సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు.
➦ కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 31 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులకు మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
➦ అదే విధంగా తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 78 పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్ష ద్వారా ఎంపికలు చేపడతారు.
తెలంగాణ మున్సిపల్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు, నోటిఫికేషన్, అర్హతలివే!
➦ తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీనోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్ష ద్వారా ఎంపికలు చేపడతారు.
తెలంగాణలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ - అర్హతలివే!
➦ తెలంగాణ రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్-1లో ఉండగా.. 59 పోస్టులు మల్టీ జోన్-2 పరిధిలో ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో పురుషులకు 71 పోస్టులు, మహిళలకు 42 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష నిర్వహించనున్నారు.
రవాణాశాఖలో 113 ఏఎంవీఐ పోస్టులు, అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
ఈ ఏడాది 26 నోటిఫికేషన్లు.. మొత్తం 18,263 పోస్టులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది జారీ చేసిన 26 నోటిఫికేషన్లల్లో 18,263 పోస్టుల భర్తీకి ప్రకటించింది. వాటిలో ప్రధానంగా గ్రూప్-1లో 503 పోస్టులు, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1365, గ్రూప్-4లో 9168 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇంజినీరింగ్ విభాగంలో ఏఈఈ 1540 పోస్టులు, మున్సిపల్ ఏఈ, జూనియర్ టెక్నికల్ అధికారులు 837 పోస్టులు, ఇంటర్మీడియెట్ జూనియర్ అధ్యాపకులు 1392 పోస్టులు, పాలిటెక్నిక్ అధ్యాపకులు 247 పోస్టులు, పుడ్ సేఫ్టీ అధికారులు 24. అటవీ కళాశాల ప్రొఫెసర్లు 27, సీడీపీవో 23. ఐసీడీఎస్-గ్రేడ్-1 సూపర్‌వైజర్లు 181. డిఏఓ (వర్క్) గ్రేడ్-2లో 53 పోస్టులు, ఎంఎయూడీ టౌన్‌ప్లానింగ్‌లో 175. భూగర్భ జలశాఖలో గెజిటెడ్ ఉద్యోగాలు 32 పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు 25, డగ్స్ ఇన్స్‌పెక్టర్ 18 పోస్టులు, పశు సంవర్థక శాఖలో విఎఎస్ 185 పోస్టులు, ఉద్యానవన శాఖలో 22 పోస్టులు, గ్రేడ్ 2 హస్టల్ వెల్పేర్ అధికారులు 581 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 128, వ్యవసాయ శాఖ అధికారులు 148 పోస్టులు ఉన్నాయి.
TS Budget Tensions : కేంద్రం నుంచి వచ్చేది అరకొరే - బడ్జెట్ కత్తి మీద సామే ! హరీష్ రావు లెక్కల మాయాజాలం ఎలా ఉంటుంది ?
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే
Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం
Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం