TRS Vs Revant : రంగంలోకి దిగితే బట్టలూడదీసి కొడతాం.. రేవంత్‌కు టీఆర్ఎస్ నేతల హెచ్చరిక !
రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తాము గీత దాటితే గుడ్డలూడదీసి కొడతరామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జంగ్ సైరన్ సభలో చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించి సభలో టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమపై తీవ్ర విమర్శలు చేయడాన్ని టీఆర్ఎస్ నేతలు ఖండించారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రేస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా ఆ పార్టీ మారడం లేదని మండిపడ్డారు. 2014కంటే ముందు ఉమ్మడి పాలమూరులో లక్ష ఎకరాలకు మించి నీళ్లు పారలేదన్నారు. 60లక్షల ఎకరాల పంటలున్న ఉమ్మడి పాలమూరులో 1లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారన్నారు. కర్ణాటకకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందని జూరాల కట్టలేదనిఆరోపించారు.
Also Read : హుజురాబాద్‌లో 30, బద్వేలులో 15 మంది ! ఉపఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారు !
కాంగ్రెస్ వల్లే ఉమ్మడి పాలమూరుకు నీళ్లు అందడం లేదని ఆనాడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. గద్వాల్- అలంపూర్ ఇవాళ సస్యశ్యామలం అయిందని.. జూరాల 6 టీఎంసీలకు 36ఏళ్ళు పడితే తుమ్మిళ్ల 11 టీఎంసీ ప్రాజెక్టు 9 నెలల్లో పూర్తి చేశామన్నారు. రాజకీయాల కోసం అమరుడు శ్రీకాంతాచారి ఫోటో పెట్టు తిరుగుతున్నారి.. ఆయన మా జెండా పట్టుకున్న అమరుడు కాదా అని మంత్రులు ప్రశ్నించారు. శ్రీకాంతాచారిని అడ్డుపెట్టుకోవడానికి సిగ్గు- ఎగ్గూ లేదని విమర్శించారు. అంతా రాజకీయమే చేస్తున్నారని.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క చర్చ అయినా పెట్టలేదని..కేసీఆర్ కంటే బాగా అభివృద్ధి చేస్తాం అని ఒక్కటైనా అంశం చెప్పలేదన్నారు. కాంగ్రేస్ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ పాలన కంటే మంచి అభివృద్ధి ఉంటే ఒక్కటైనా చెప్పాలని సవాల్ చేశారు.
Also Read : టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్, తేదీ ఎప్పుడంటే.. కేటీఆర్ ప్రకటన
రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్‌కు కొత్త పేరు జంగ్ సైరన్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మళ్ళీ జైలుకు వెళ్లడం ఖాయమని..శాశ్వత ఖైదీ నెంబర్ ఉండే రోజులు దగ్గరే ఉన్నాయన్నారు. దళితులు అంటే రేవంత్ కి ఎందుకు అంత చిన్నచూపని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నోట మహేంద్రనాథ్ పేరు ఎందుకు చెప్పలేదననారు. తాము రంగంలోకి దిగితే బట్టలు ఉడదీసి కొడతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తాము చేసిన దుర్మాగాలు ఏమైనా ఉంటే బయటపెట్టాని.. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు.
Also Read : బీజేపీ నేత అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఫ్యామిలీ.. చెప్పులతో దాడి
పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రేస్ నేతల కండ్లు ఎర్రబడుతున్నాయని పాలమూరు టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. నిరుద్యోగుల గురించి టీఆర్ఎస్‌కు కమిట్మెంట్ ఉందని.. వాళ్లకు చేయాల్సింది చాలా ఉందన్నారు. అన్ని వర్గాలకు అన్ని దక్కాయి- ఇక మిగిలింది నిరుద్యోగులే వాళ్లకు చేయాల్సిన న్యాయం చేస్తామన్నారు. సైరన్ పేరుతో సభ పెట్టి అన్నీ అబద్దాలే చెప్పారని.. .ప్రజలు టీ ఆర్ ఎస్ వెంటే ఉన్నారని.. పాలమూరు ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలు తెలుసన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి