By: ABP Desam | Updated at : 09 Aug 2023 03:09 PM (IST)
ఏపీ, తెలంగాణ టాప్ హెడ్ లైన్స్
Top 5 Telugu Headlines Today 9 August 2023:
పంచాయతీ నిధుల మళ్లింపుపై ఏపీ బీజేపీ పోరుబాట - గురువారం కలెక్టరేట్ల ముందు ధర్నాలు
పంచాయితీ నిధుల మళ్ళింపు వ్యవహరం పై భారతీయ జనతా పార్టి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈనెల 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తలపెట్టాలని పార్టి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయితీల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్ళించటం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిధులు స్వాహా చేస్తున్నారంటూ, ఇప్పటికే సర్పంచ్ లు ఢిల్లీ వేదికగా ఆందోళనలు కూడ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మండలాల వారీగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీరికి మద్దతుగా రాజకీయ పార్టీలు కూడ రంగంలోకి దిగుతున్నాయి. పూర్తి వివరాలు
వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం - గుడివాడలో చిరంజీవి అభిమానుల భారీ ర్యాలీ !
మెగాస్టార్ చిరంజీవిపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్లు చేశారని చిరంజీవి అభిమానులు బుధవారం ఆందోళనకు దిగారు. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరంజీవి అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు
కేసీఆర్ లక్ష్యం ఢిల్లీ పీఠమే - కానీ ప్లాన్ మాత్రం వేరే !
ఢిల్లీలో వచ్చేది మన ప్రభుత్వమే.. దేశమంతా రైతు బంధు అమలు చేస్తాం అని కేసీఆర్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని సుదీర్ఘ కాలంగా పరిపాలించి నాశనం పట్టించాయని.. భారత రాష్ట్ర సమితి దేశాన్ని అమెరికా కన్నా ఎక్కువ అభివృద్ది చేస్తుందని చెబుతూ వస్తున్నారు. అందుకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మర్చారు. కానీ కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పార్టీ విస్తరణకే సమయం కేటాయిస్తున్నారు. కనీసం మరో పొరుగు రాష్ట్రం ఏపీ వైపు కూడా చూడటం లేదు. మరి ఢిల్లీ పీఠం ఎలా దక్కించుకుంటారన్నదానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆయన పార్టీని ట్రోల్ చేస్తన్న వారు కూడా ఉన్నారు.కానీ కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం కష్టం. ఆయన ప్లాన్ చూస్తే అదే నిపించక మానదు. పూర్తి వివరాలు
చిరంజీవి పోరాటం వల్లే ఉమ్మడి రాజధాని - మెగాస్టార్‌కు మద్దతుగా ఉండవల్లి అరుణ్ కుమార్ !
సినిమా ఇండస్ట్రీ నిజంగా పిచ్చుకే కానీ చిరంజీవి కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమర్ స్పష్టం చేశారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో చిరంజీవి గట్టిగా మాట్లాడారని.. చిరంజీవి మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందని స్పష్టం చేశారు. హోదాపై పోరాడాలని మంత్రులకు సలహా ఇవ్వడం తప్పు కాదన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్.. చిరంజీవిపై ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలను ఖండించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందన్నారు. పూర్తి వివరాలు
6 కిలోమీటర్ల పర్యటనకే హెలికాప్టర్ ఉపయోగిస్తున్న వాళ్లు గిరిజన ప్రాణాల కోసం చేయలేరా!
అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కల్లాకపటం తెలియని వారు గిరిజనులు వారికి ఎల్లప్పుడూ కూడా విద్య , వైద్యం అందుబాటులో ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బుధవారం జరుగుతున్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అడవుల్లో, కొండల్లో ఉంటూ అడవి సంప్రదాయాలను బతికించుకుంటున్నారని వారిని ఆయన అభినందించారు. అడవిలో ఉండే చెట్లనే వారు దైవంగా భావిస్తారు. అడవిలో ఉండే సకల జీవాలను కూడా వారు దైవ సమానంగా చూస్తారు. పూర్తి వివరాలు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!
TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ
Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం
Minister Dance: గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేసిన మంత్రి, ఆయనతో కలెక్టర్, ఎస్పీ కూడా
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
/body>