అన్వేషించండి

APBJP : పంచాయతీ నిధుల మళ్లింపుపై ఏపీ బీజేపీ పోరుబాట - గురువారం కలెక్టరేట్ల ముందు ధర్నాలు

పంచాయతీ నిధుల మళ్లింపుపై ఏపీ బీజేపీ పోరుబాట పట్టింది. పదో తేదీన అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది.

APBJP :   పంచాయితీ నిధుల మళ్ళింపు వ్యవహరం పై భారతీయ జనతా పార్టి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈనెల 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తలపెట్టాలని పార్టి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి క్యాడర్ కు  దిశానిర్దేశం చేశారు.  గ్రామ పంచాయితీల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్ళించటం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిధులు స్వాహా చేస్తున్నారంటూ, ఇప్పటికే సర్పంచ్ లు ఢిల్లీ వేదికగా ఆందోళనలు కూడ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మండలాల వారీగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీరికి మద్దతుగా రాజకీయ పార్టీలు కూడ రంగంలోకి దిగుతున్నాయి. 

ప్రభుత్వాన్ని నిలదీయడానికి వెనుకాడేది లేదన్న  బీజేపీ                             

రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి భారతీయ జనతా పార్టీ సన్నద్దం అవుతోంది. సర్పంచ్ లు చేస్తున్న ఆందోళనకు గతంలోనే భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది.  పంచాయితీల నిధులను స్వాహా చేస్తే గ్రామాలు  ఎలా అభివృద్ది చెందుతాయని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే గళం విప్పింది. ఇదే విషయం పై భారతీయ జనతా పార్టి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర స్ధాయిలో నాలుగు జోన్ లలో నిర్వహించిన  బీజేపీ జోనల్ సమావేశాల్లో  రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు .  

గ్రామపంచాయతీలు నిర్వీర్యానికి  ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న బీజేపీ                                          

గాంధీ మహాత్ముడు కలలుకన్న గ్రామ స్వరాజ్యం రావాలని కేంద్రం నేరుగా గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం  ఆ నిధులకు మోకాలొడ్డుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో  కనీస మౌలిక సదుపాయాలు కూడా  కల్పించలేని పరిస్ధితిలు ఏర్పడుతున్నాయని ఈ విషయాలను రాష్ట్ర వ్యాప్త పర్యటనలో తాను గుర్తించానని, దగ్గుబాటి పురందేశ్వరి  వ్యాఖ్యానించారు. సర్పంచ్ ల హక్కుల సాధన కు పోరుబాట పడుతున్నామని పురందేశ్వరి స్పష్టంగా ప్రకటించారు. 

కలెక్టరేట్ల ముందు భారీ ధర్నాలు                     

ఈనెల  10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ల వద్ద ఆందోళన కార్యక్రమాలకు  పురందేశ్వరి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని  భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టి క్యాడర్ అంతా కలసి కట్టుగా పని చేయాలని, స్దానిక నాయకత్వం పంచాయితీల కోసం ఆందోళనలు పాల్గోనాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర నేతలు, కోర్ కమిటీ సభ్యలుతో  ఆడియో, వీడియో కాన్ఫెరెన్సులు కూడా దగ్గుబాటి పురంధేశ్వరి నిర్వహించారు. అన్ని స్థాయిల బీజేపీ నేతలు కలెక్టరేట్ల ఎదుట జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు.            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget