అన్వేషించండి

Undavalli On chiru : చిరంజీవి పోరాటం వల్లే ఉమ్మడి రాజధాని - మెగాస్టార్‌కు మద్దతుగా ఉండవల్లి అరుణ్ కుమార్ !

చిరంజీవికి ఉండవల్లి అరుణ్ కుమార్ మద్దతు పలికారు. ఆయన మాట్లాడబట్టే ఉమ్మడి రాజధాని వచ్చిందన్నారు.

 

Undavalli On chiru : సినిమా ఇండస్ట్రీ నిజంగా పిచ్చుకే కానీ చిరంజీవి కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమర్ స్పష్టం చేశారు.  విభజన సమయంలో పార్లమెంట్‌లో చిరంజీవి గట్టిగా మాట్లాడారని..   చిరంజీవి మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందని  స్పష్టం చేశారు.  హోదాపై పోరాడాలని మంత్రులకు సలహా ఇవ్వడం తప్పు కాదన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్..  చిరంజీవిపై ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలను ఖండించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందన్నారు. 

కేంద్రంలో మంత్రిగా ఉండి  సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారన్న ఉండవల్లి                                 

స్వయంగా కేంద్రంలో  మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు. కానీ చిరంజీవి సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. అలాంటి చిరంజీవి ప్రత్యేక హోదా కోసం ఏపీ మంత్రులు పోరాటం చేయాలని సలహా ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదని ఉండవల్లి స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు వందల రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వ తీరుపై అసహనం  వ్యక్తం చేశారు. 

సినీ పరిశ్రమను పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తారని.. ప్రజలకు పనికొచ్చే వాటిపై దృష్టి పె ట్టాలని చిరంజీవి సలహా                                                

పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడతారెందుకని.. ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేకహోదా వంటిపై పోరాడితే.. ప్రజలు దండం పెడతారన్నారు. అయితే ఇలా సలహా ఇవ్వడంపై  వైఎస్ఆర్‌సీపీ మంత్రులు విరుచుకుపడ్డారు. కొడాలి నానితో పాటు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, రోజా వంటి నేతలు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నారన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. దీనికి ఉండవల్లి అరుణ్ కుమర్ చిరంజీవికి మద్దతుగా మాట్లాడారు.  

మార్గదర్శిపై కక్షతో చేసిన తప్పు లేదన్న ఉండవల్లి                           

మరో వైపు మార్గదర్శి విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా తప్పు లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. 'విదేశాలకు కళాంజలి కళాకృతులు' అంటూ   పత్రికలో రాసినందుకు సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌పై రామోజీరావు కేసు పెట్టారన్నారు. కళాంజలి పేరుతో  చారిత్రక వస్తుువులను స్మగ్లింగ్ చేస్తున్నారని రాయడంతో ఈ కేసు పెట్టారని..  ఈ కేసులో రామోజీపై పోరాడలేక ఏబీకే ఫైన్ కట్టి బయటపడ్డారన్నారు.  డబ్బులు ఉంటేనే కోర్టులో న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం సహకరిస్తోంది కాబట్టే మార్గదర్శిపై పోరాటం చేస్తున్నట్లు ఉండవల్లి చెప్పుకొచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget