Top Headlines Today: జనసేనకు గ్లాస్ గుర్తును కన్ఫామ్ చేసిన ఈసీ! బీజేపీతో ఎలాంటి డీల్ లేదన్న అసదుద్దీన్
Top 5 Telugu Headlines Today 19 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 19 September 2023:
జనసేన గుర్తు కన్ఫర్మ్ - పవన్ కల్యాణ్ హ్యాపీ !
కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అని పేర్కొంటూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. పూర్తి వివరాలు
తెలుగు రాష్ట్రాలపై మహిళా రిజర్వేషన్ బిల్లు ఎఫెక్ట్, అన్ని సీట్లు కేటాయించాల్సిందేనా?
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ... అనూహ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలైతే... లోక్ సభ, రాజ్యసభ, శాసనసభల్లో మహిళలకు ప్రాధాన్యం పెరగనుంది. లోక్ సభలో 181 పార్లమెంట్ స్థానాలు, రాజ్యసభలో 80కిపైగా స్థానాలను మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్ సభలో 82 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారు. పూర్తి వివరాలు
సీమ కష్టాలు తెలిసే హంద్రీనీవా ప్రాజెక్టు త్వరగా పూర్తి చేశాం: జగన్
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు సీఎం జగన్. ఈసందర్భంగా హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం డోన్ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసు అన్నారు. ఇక్కడ వర్షపు నీటితోనే పంటలు పడుతున్నాయని వేరే ఆధారం లేదన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి కోసం చర్యలు చేపట్టామన్నారు. గతంలో డోన్‌లో ఒక్క ఎకరం కూడా ప్రత్యేక ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పండే పరిస్థితి లేకుండేదన్నారు. పూర్తి వివరాలు
బీజేపీతో ఎలాంటి డీల్ లేదు, ముస్లింల వల్లే రాహుల్ గెలుపు-అసదుద్దీన్ ఓవైసీ
ఇండియా కూటమిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. I.N.D.I.A కూటమిలో చేరేది లేదన్న ఆయన, ఇప్పటికే కూటమికి ఊపిరి ఆడటం లేదన్నారు. బీజేపీ ఐడీయాలజీకి వ్యతిరేకంగా ఎందుకు పని చేయడం లేదన్న అసదుద్దీన్, ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా హిందువుల ఓట్లు మాత్రం కూటమి అభ్యర్థులకు రావని స్పష్టం చేశారు. బీజేపీతో తనకు ఎలాంటి డీల్ లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారని, వయ్‌నాడ్‌లో గెలుపొందారని గుర్తు చేశారు. వయ్‌నాడ్‌లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారని, అందుకే రాహుల్ గెలుపొందారని అన్నారు. పూర్తి వివరాలు
పొత్తు సూపర్ హిట్ అవుతుందన్న టీడీపీ, జనసేన లీడర్లు- 2019 ఎన్నికల గణాంకాలు విశ్లేషిస్తున్న నేతలు
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల మధ్య సీట్ల వ్యవహారంపై త్వరలోనే కొలిక్కి రానుంది. ఈ వ్యవహారాలు చక్కబెట్టేందుకు సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. జనసేన 25 నుంచి 30 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అందులోనే ఉభయ గోదావరి జిల్లాల నుంచే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. జనసేనాని పొత్తు ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా 2024 అసెంబ్లీ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. జనసేన, టీడీపీ అభిమానులు ఓ అడుగు ముందుకు వేసి... వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు





















