By: ABP Desam | Updated at : 19 Sep 2023 09:42 AM (IST)
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎఫెక్ట్, అన్ని సీట్లు కేటాయించాల్సిందేనా ?
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ... అనూహ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలైతే... లోక్ సభ, రాజ్యసభ, శాసనసభల్లో మహిళలకు ప్రాధాన్యం పెరగనుంది. లోక్ సభలో 181 పార్లమెంట్ స్థానాలు, రాజ్యసభలో 80కిపైగా స్థానాలను మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్ సభలో 82 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును రెండు సభలు ఆమోదిస్తే... ప్రస్తుతం ఉన్న ఎంపీలకు మరో వంద మంది ప్రాతినిధ్యం దక్కనుంది.
బిల్లుతో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చుకోవాల్సిందేనా ?
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాల్లో దాదాపు 40 అసెంబ్లీ స్థానాలను మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. అదే విధంగా 17 పార్లమెంట్ స్థానాల్లో ఇంచుమించు 6 సీట్లు మహిళలకే ఇవ్వాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే, బీఆర్ఎస్ కు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయ్. 115 అసెంబ్లీ స్థానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మరో నాలుగు సీట్లకు మాత్రమే అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో బీఆర్ఎస్, దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సి ఉంటుంది. అసెంబ్లీ స్థానాల వారీగా మహిళా అభ్యర్థుల కోసం అన్వేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే బిల్లు వచ్చాక, అందుకు అనుగుణంగా సీట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది.
58 అసెంబ్లీ సీట్లు మహిళలకు కేటాయించాల్సిందేనా ?
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లతోపాటు 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 58 అసెంబ్లీ టికెట్లు, 8 పార్లమెంట్ స్థానాలను మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మెజార్టీ స్థానాలను పురుషులకే కేటాయించిన పార్టీలు మహిళా బిల్లుతో తెలుగు రాష్ట్ర రాజకీయాలు మొత్తం మారిపోనున్నాయి. శాసనసభల్లో మహిళలకు భారీగా ప్రాధాన్యం పెరగనుంది. అసెంబ్లీ సీట్లే కాకుండా మంత్రి వర్గంలోనూ మహిళలు మహరాణులు కానున్నారు. మహిళా బిల్లుతో పురుషాధిపత్యానికి కొంత చెక్ పడనుంది.
తొలిసారి బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఈనాటిది కాదు. తొలిసారి ఈ బిల్లును 1996లో అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ హయాంలో నాలుగుసార్లు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టారు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభలో 186-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగ్ లోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ వస్తున్న వేళ...కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.
Also Read: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వేళ ఎంపీలకు ప్రత్యేక బహుమతులు
Also Read: తీరనున్న 27 ఏళ్ల కల- పార్లమెంటు ముందుకు రానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు
Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్
Nara Brahmani : పొలిటికల్ కామెంట్లు చేస్తున్న నారా బ్రహ్మణి - రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లేనా..?
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Nara Bramhani Politics : టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్‌గా తీసుకుంటారా ?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
/body>