Top Headlines Today: ఏపీలో అమల్లోకి భూ హక్కుల చట్టం! మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
Top 5 Telugu Headlines Today 15 November 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu Headlines Today: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎక్కడ ? తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని తోట చంద్రశేఖర్
తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP)అగ్రనేతలు వరుసగా ర్యాలీలు, సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. విరామం లేకుండా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో సీమంధ్ర ప్రభావం ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో సెటిలర్లు ఎవరివైపు మొగ్గు చూపితే, ఆ పార్టీనే అధికారంలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఎక్కడ ? అన్న చర్చ మొదలైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి భూ హక్కుల చట్టం-దేశంలోనే తొలిసారి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఏపీలో భూ హక్కుల చట్టాన్నిఅమల్లోకి తెచ్చింది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం (YSRCP Govt). ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023 (Land Titling Act) ను ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచే అమల్లోకి తెస్తున్నట్టు.. ఇటీవల జీవో నంబర్ 512 జారీ చేసింది జగన్ ప్రభుత్వం. అయితే... దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ నిన్న (మంగళవారం) విడుదలైంది. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో... రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. భూమి (Land) హక్కులపై యజమానులు, కొనుగోలుదారులకు పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఓటింగ్ పెంచేందుకు ఈసీ కొత్త విధానం- ప్రత్యేక థీమ్‌లతో పోలింగ్ కేంద్రాలు
తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల సమయం ఉంది. నవంబర్ 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. గతంలో పోలిస్తే ఓటింగ్ శాతం పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొత్త కొత్త ఆలోచనలు కూడా చేస్తున్నారు. సరికొత్త విధానాలను అవలంభిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక థీమ్‌లతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాయి. ఎన్నికల్లో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోరు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, దివ్యాంగులు ఉంటారు. యువత కూడా చాలా మంది ఓటు వేయడంలేదని అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీ బీజేపీలో సంక్షోభం - పురందేశ్వరిపై సగం మంది నేతల అసంతృప్తి !
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో అంతర్గత సంక్షోభం రాజుకుంటోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని వ్యతిరేకించేవారు ఇంత కాలం సైలెంట్ గా ఉండేవారు. ఇటీవలి కాలంలో ఆమె పనితీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారిని ఎప్పటికప్పుడు సస్పెండ్ చేస్తూండటంతో వారు ఇక స్వేచ్చ వచ్చిందని మరిన్ని విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాయలసీమకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి అనే నేత చేసిన ఆరోపణలు బీజేపీలో సంచలనం రేపుతున్నాయి. బీజేపీ అధ్యక్షురాలుగా టీడీపీ కోసం పని చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు-భారీగా నగదు స్వాధీనం
తెలంగాణ ఎన్నికల వేళ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. రాజకీయ నేతలు, వారి అనుచరులు, బంధువుల ఇళ్లు.. వారికి సంబంధించిన కంపెనీలలో వరుస తనిఖీలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. అలాగే తుమ్మల నాగేశ్వరరావు, జానారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి ఇంటిపై కూడా ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ ఐటీ దాడులు జరిగాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి