Top 5 Headlines Today: బీజేపీ సపోర్ట్ లేకపోవచ్చు, ప్రజలే తన బలమన్న జగన్- అభివృద్ధే గెలిపిస్తుందని కేసీఆర్ ధీమా! నేటి టాప్ 5 హెడ్ లైన్స్
Top 5 Telugu Headlines Today 12 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
బీజేపీ సపోర్ట్ నాకు లేకపోవచ్చు- ప్రజలే నా బలం- జగన్ కీలక వ్యాఖ్యలు
వరుసగా రెండురోజులు ఇద్దరు అగ్రనేతలు ఏపీలో పర్యటించి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అవినీతిమయమైపోయిందన్నారు. ఎక్కడిక్కడ మాఫియాలు రెచ్చిపోతున్నాయన్నారు. ఈ కామెంట్స్‌తో పొలిటికల్‌గా కాక రేగింది. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. క్రోసూరు సభలో మాట్లాడి సీఎం జగన్ నేరుగా బీజేపీని ఎక్కడా టార్గెట్ చేసుకోలేదు. కానీ చంద్రబాబుకు మాదిరిగా జగన్‌కు ఉండకపోవచ్చన్నారు. ప్రజలనే తాను నమ్ముకున్నానని అన్నారు. వాళ్లే తన బలం బలగమని కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలు
బీజేపీ అగ్రనేతల విమర్శలపై జగన్ మౌనం - వారి ఆరోపణలను అగీకరిస్తున్నట్లేనా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇప్పటి వరకూ అందరికీ ఓ గట్టి నమ్మకం ఉంది. వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి విషయాల్లోనూ కేంద్రానికి ఎదురు చెప్పకపోవడమే కాదు.. లఏ విషయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించిన సందర్భం కూడా లేదు. పైగా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వంటి విషయాల్లో బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకుని ఇతర పార్టీలకు సీఎం జగన్ నీతులు కూడా చెప్పారు. అలాంటి సహకారం అందిస్తున్నా.. బీజేపీ అగ్రనేతలు మాత్రం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు
ఆ రోజులు పోయాయి, ఇప్పుడు పని చేసేవాడికే గుర్తింపు, అభివృద్ధే గెలిపిస్తుంది: సీఎం కేసీఆర్
పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంత కర్తలు, తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ ఓట్లేయమంటే ప్రజలు పట్టించుకునే అవకాశమే లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ప్రజలకు పేర్లతో పని లేదని. పని చేయగల్గిన వాళ్లతోనే పని అంటూ చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కేంద్రంలో పాలన నిర్లక్ష్యంగా, దశ దిశ లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ఈ తీరు దేశ భవిష్యత్తును నాశనం చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆదివారం ప్రగతి భవన్ లో మధ్య ప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సహా 200 మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాంద్వాడా జిల్లా జున్నార్ దేవ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామ్ దాస్ యికే, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ ముస్కోలే తదితరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాలు
తొలి రోజే బడి పిల్లలకు విద్యాకానుక-పల్నాడు జిల్లా క్రోసూరులో అందజేసిన జగన్
పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్ పంపిణీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అదే ఊరి స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)ని ఈ విద్యా కానుక కిట్‌లో ఉంచారు. పూర్తి వివరాలు
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉత్సాహంగా తెలంగాణ రన్ - పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ ను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో అంబేడ్కర్ విగ్రహం వద్ద మంత్రి మహమూబ్ అలీ 2కే రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషా సింగ్, గాయకులు మంగ్లీ, రామ్ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. పూర్తి వివరాలు